TSPSC | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన జనరల్ ర్యాకింగ్ జాబితా (జీఆర్ఎల్)ను గురువారం వెల్లడించారు. ఫలితాల జాబితాను https://www.tspsc.gov.in వెబ్సైట్లో పొందుపరిచినట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది.