Archery | షాంఘై: చైనాలోని షాంఘై వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ -1 టోర్నీలో భాగంగా గురువారం ముగిసిన పురుషుల రికర్వ్ ఆర్చరీ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్ చేరింది. తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ఆటగాడు ధీరజ్ బొమ్మదేవరల త్రయం ఇటలీని 5-1 తేడాతో చిత్తు చేసింది.
ఫైనల్లో భారత్.. దక్షిణకొరియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇదే టోర్నీలో భాగంగా భారత పురుషుల, మహిళల కాంపౌండ్ జట్లు ఇదివరకే ఫైనల్ చేరాయి.