Dasoju Shravan kumar | పరిపాలన చేస్తున్నవా.. పరాచకాలు ఆడుతున్నవా..? సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ ఫైర్
Dasoju Shravan Kumar | శారదా పీఠం దగ్గర భూములు గుంజుకుంటమని చెప్పి నోటీసులు ఎట్ల ఇస్తవు.. గుంజుకోవడానికి బుల్డోజర్లను ఎట్లా పంపుతవని సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్‌కుమార్.
Dasoju Shravan Kumar | ఇది దోపిడీ ప్రభుత్వం.. బాధ్యత లేని ప్రభుత్వమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏదైనా పరిపాలనపై పట్టున్నదా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కలెక్టర్లకైనా సమాధానం చెప్పాలె. శారదా పీఠం దగ్గర భూములు గుంజుకుంటమని చెప్పి నోటీసులు ఎట్ల ఇస్తవు.. గుంజుకోవడానికి బుల్డోజర్లను ఎట్లా పంపుతవని ప్రశ్నించారు.
తెల్లవారు జామునే హరీష్ రావు పోయిన తర్వాత తప్పయిపోయిందని ఎట్లా రిట్రీట్ అయితవు. టీ హబ్‌లో, టీ వర్క్స్‌లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పెట్టొచ్చునని జీవోలు ఎట్ల ఇస్తవు.. మళ్లా పొద్దుగాళ్ల సిటిజన్లంతా గగ్గోలు పెట్టగానే.. మేం తప్పు చేశామని రిట్రీట్ అయితవ్.. పరిపాలన చేస్తున్నవా.. పరాచకాలు ఆడుతున్నవా..? నీకు పరిపాలన చేతకావడం లేదనడానికి ఇది నిదర్శనం. నీకు పరిపాలన మీద పట్టు లేదనడానికి నిదర్శనమిది. పరిపాలనను రివ్యూ చేసేందుకు సోయి లేదనడానికి ఇవన్నీ నిదర్శనమన్నారు ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్‌కుమార్.
ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి దోపిడీ. లగచర్లలో విధ్వంసం, ఖమ్మం వెలుగుమట్లలో విధ్వంసం, గాంధీ విగ్రహం పేరు మీద దోపిడీ, విధ్వంసం.. రూ.5 వేల కోట్లతో లక్షన్నర కోట్ల రూపాయల ప్రాజెక్టు అని అదానీకి కట్టబెట్టి అక్కడ దోపిడీ చేయాలా..? మళ్లా ఇండ్లను విధ్వంసానికి గురి చేయాలా..? ఏం పాపం ఇది.. పండుగ పూట ఇలాంటి పరుషమైన పదజాలంతో మాట్లాడటానికి నాకు కొంత సంశయమనిపించినప్పటికీ కూడా తప్పక మాట్లాడుతున్నానంటూ చెప్పుకొచ్చారు.
Read Also :
Sanju Samson | అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరో .. సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
Asif Zardari | మరో యుద్ధానికి భారత్ సన్నాహాలు.. పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ ఆరోపణలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

