ఆత్మకూర్.ఎస్, మార్చి 03 : ఆత్మకూర్.ఎస్ మండలం ఇస్తళాపురం గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న కోళ్ల షెడ్డు నిర్మాణాన్ని సర్పంచ్, ఉప సర్పంచ్, చుట్టుపక్కల రైతులు అడ్డుకున్నారు. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని తాగునీటి బోర్లు ఈ కోళ్ల ఫారం నిర్మాణం పక్కనే ఉన్న నేపథ్యంలో తాగునీరు కలుషితం అవుతుందని, ఊరికి సమీపంలో షెడ్డు ఉండడం వల్ల ప్రజలు దుర్వాసనకు రోగాల బారిన పడుతారు కావునా కోళ్ల షెడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.