ద్రవ్యోల్బణ నియంత్రణకు ఎంపీసీ..డిపాజిటర్ల రక్షణకు సీఆర్ఆర్
ఆర్బీఐ తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష - 2024-25
- ప్రకటించిన తేదీ – 2024, ఏప్రిల్ 5 (ఏప్రిల్ 3-5 వరకు జరిగింది)
- ఎలాంటి మార్పు లేకుండా 6.5 శాతం వద్ద రెపోరేటును కొనసాగింపు
- రెపోరేటును ఎలాంటి మార్పు లేకుండా ఉంచడం ఇది వరుసగా ఏడోసారి.
- 2023, ఫిబ్రవరి నుంచి కీలక రేట్లను ఆర్బీఐ యధాతథంగా కొనసాగిస్తుంది
రెపోరేటు మార్చకుండా ఉండటానికి ఆర్బీఐ చెప్పిన కారణం
- 2024 ఏప్రిల్, జూన్ మధ్య సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు ఉండొచ్చన్న వాతావరణ శాఖ (IMD) అంచనాల నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళనలు, కీలక రేట్లలో ఎలాంటి మార్పులు లేకపోవడం వల్ల గృహ, వాహన రుణాల EMIలు మరికొన్నాళ్లు స్థిరంగా కొనసాగవచ్చు.
- ప్రస్తుతం రెపోరేటును అలాగే కొనసాగించాలనే ప్రతిపాదన విషయంలో ఎంపీసీ (మానిటరింగ్ పాలసీ కమిటీ)లోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు అనుకూలంగా, ఒకరు ప్రతికూలంగా వ్యవహరించారు.
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7 శాతంగా ఉంటుందని ప్రకటించి (యధాతథంగా) దీనికి కారణం సాధారణ వర్షపాతం అంచనాలు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గడం, తయారీ, సేవా రంగాలు స్థిరంగా రాణిస్తుండటాన్ని దృష్టిలో పెట్టుకోవడం
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో
Q1 (మొదటి త్రైమాసికం)లో 7.1 శాతం
Q2 (రెండో త్రైమాసికం)లో 6.9 శాతం - 2023 – 24 – 7.6 శాతం
Q3 (మూడో త్రైమాసికం)లో 7 శాతం
Q4 (నాలుగో త్రైమాసికం)లో 7 శాతం వృద్ధిరేటు ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. - 2024-25 ద్రవ్యోల్బణ అంచనాను 4.5 శాతం వద్ద యధాతథంగా ఉంచింది.
Q1 – 4.9% Q2 – 4.6%
Q3 – 3.8% Q4 – 4.7% - 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) ప్రవాహం 41.6 బిలియన్ డాలర్లు ఇది 2014-15 తర్వాత అత్యధికం
- 2024, మార్చి 29 నాటికి విదేశీ మారకపు నిల్వలు 645.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో బంగారం విలువ 51.487 బిలియన్ డాలర్లుగా ఉంది.
- ప్రభుత్వ సెక్యూరిటీస్ లేదా ప్రభుత్వ బాండ్ల మార్కెట్ల్లో రిటైల్ మదుపుదార్లు పాల్గొనేలా వీలు కల్పించేందుకు ఒక మొబైల్ యాప్‌ను ఆర్బీఐ తీసుకురానుంది. దీని ద్వారా బాండ్ల కొనుగోలు, విక్రయాలు నిర్వహించవచ్చు.
- ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (IFSC)లో సార్వభౌమ హరిత బాండ్లు (Sovereign Green bonds) ట్రేడింగ్‌కు RBI అనుమతి.
- యూపీఐ ద్వారా బ్యాంకుల్లో నగదు జమ చేసే సదుపాయం త్వరలో అందుబాటులోకి తేనున్నది.
- థర్డ్‌పార్టీ యూపీఐ అప్లికేషన్ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పీపీఐ) అనుసంధానానికి అనుమతి ఇవ్వాలని ఆర్బీఐ నిర్ణయించింది.
- సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) వ్యాలెట్లను అందించేందుకు బ్యాంకింగేతర పేమెంట్ సిస్టం ఆపరేటర్లకు అనుమతి.
- ప్రవాసులు పంపిస్తున్న డబ్బులు అధికంగా పొందుతున్న దేశాల్లో భారత్ అగ్రగామిగా ఉంది.
- బ్యాంకుల కోసం మరికొద్ది రోజుల్లో ఎల్‌సీఆర్ ఫ్రేమ్‌వర్క్ ముసాయిదాను విడుదల చేయనున్నది (Liquidity Coverage Ratio).
- స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులన్నింటికి రూపాయి వడ్డీ రేటు ఉత్పాదక ఉత్పత్తుల్లో వ్యవహరించడం.
- ఆర్బీఐ తదుపరి ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్ష 2024, జూన్ 5-7 మధ్య జరగనుంది.
ఆర్బీఐ ప్రస్తుత రేట్లు
- రెపోరేటు – 6.50 శాతం
- స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు (ఎస్డీఎఫ్) – 6.25 శాతం
- మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు (ఎమ్ఎస్ఎఫ్) – 6.75 శాతం
- బ్యాంక్ రేటు – 6.75 శాతం
- రివర్స్ రెపో రేటు – 3.35 శాతం
- నగదు నిల్వల నిష్పత్తి – 4.50 శాతం
- ఎస్ఎల్ఆర్ – 18.00 శాతం
రెపోరేటు
- ఆర్బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు తీసుకున్న రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే రేటు – దీన్నే స్వల్పకాలిక వడ్డీ రేటు అంటారు.
- దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెపోరేటును నిర్ణయిస్తారు.
- రెపోరేటును తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులకు తక్కువకే రుణాలు వస్తాయి. ఈ ప్రభావంతో కంపెనీలకు, వ్యక్తులకు రుణాల వడ్డీరేటును వాణిజ్య బ్యాంకులు తగ్గించే అవకాశం ఉంటుంది.
RePo – Repurchase option or
Repurchase Agreement
ఎఫ్‌పీఐ – విదేశీ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెట్టడానికి ఒక సాధారణ మార్గం.
- ఒక దేశం నుంచి పెట్టుబడిదారులు మరో దేశంలో ఆర్థిక ఆస్తులు లేదా సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి ఒక మార్గం.
- ఈ పెట్టుబడుల్లో స్టాక్‌లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లు మొదలైనవి ఉంటాయి.
- ఎఫ్‌పీఐలు కంపెనీ ఆస్తులపై పెట్టుబడిదారునికి నియంత్రణ ఇవ్వని పరోక్ష పెట్టుబడులు.పీపీఐ – ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్
- ఇవి డిజిటల్ చెల్లింపు పరిష్కారాలు, ఇవి ఎలక్ట్రానిక్‌గా డబ్బును నిల్వ చేయడానికి, వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అనుమతిస్తాయి.
ఎల్‌సీఆర్ – లిక్విడిటీ కవరేజ్ రేషియో
- ఎల్‌సీఆర్ ఫ్రేమ్‌వర్క్ కింద ఉన్న బ్యాంకులు వచ్చే 30 రోజుల్లో ఆశించిన నికర నగదు ప్రవాహాలను కవర్ చేయడానికి అధిక-నాణ్యత ద్రవ్య ఆస్తుల స్టాక్‌ను తప్పనిసరిగా నిర్వహించాలి. ఒత్తిడి నిర్మూలన కోసం.
- దీన్ని బాసెల్ కమిటీ ప్రతిపాదించింది.
ఎస్డీఎఫ్ – స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ
- ఇది లిక్విడిటీ విండో, దీని ద్వారా బ్యాంకులు తమ అదనపు లిక్విడిటీని దాంతో ఉంచుకొనే అవకాశాన్ని ఆర్బీఐ అందిస్తుంది.
- ఇది రెపోరేటు కంటే 25 బేసిస్ పాయింట్లు తక్కువ కలిగి ఉంటుంది.
- దీన్ని 2022, ఏప్రిల్ 8 నుంచి అమలు చేస్తున్నారు
- ఆర్థిక వ్యవస్థలో రూ.8.5 లక్షల కోట్ల అదనపు లిక్విడిటీని తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం దీని ఉద్దేశం.
- 2018లో ఆర్బీఐ చట్టం, 1934లోని సెక్షన్ 17ను సవరించడం ద్వారా ఎస్డీఎఫ్ను ప్రవేశపెట్టే అధికారం ఆర్బీఐకి వచ్చింది.
- ఎస్డీఎఫ్ ఆర్థిక స్థిరత్వ సాధనం.
ఎమ్ఎస్ఎఫ్ – మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ
- ఇది బ్యాంకులు ఆమోదించిన ప్రభుత్వ సెక్యూరిటీలపై ఆర్బీఐ నుంచి అప్పటికప్పుడు తీసుకొనే రేటు.
- దీన్ని 2011లో ప్రవేశపెట్టారు.
- ఎమ్ఎస్ఎఫ్ రేటు రెపోరేటు కంటే ఎక్కువ ఉంటుంది.
బ్యాంక్ రేటు
- దేశీయ బ్యాంకులకు రుణాలు ఇచ్చే సమయంలో కేంద్ర బ్యాంక్ విధించే కనీస వడ్డీ రేటును బ్యాంక్ రేటు అంటారు.
- బ్యాంక్ రేటు పెరిగితే వాణిజ్య బ్యాంకుల రుణ ఖర్చులు పెరుగుతాయి, ఇది మార్కెట్లో ద్రవ్య సరఫరాను తగ్గిస్తుంది.
రివర్స్ రెపోరేటు
- బ్యాంకుల వద్ద ఉన్న డబ్బును ఆర్బీఐకి రుణాలుగా ఇవ్వవచ్చు. అలా ఇచ్చే రుణాలకు ఆర్బీఐ బ్యాంకులకు చెల్లించే వడ్డీరేటు ఇది.
- ఇది రెపోరేటు కంటే తక్కువగా ఉంటుంది.
- మార్కెట్లో స్థిరత్వం లేనప్పుడు బ్యాంకులు తమ అదనపు డబ్బును ఆర్బీఐ వద్ద ఉంచి తక్కువైనా సరే స్థిర వడ్డీ ఆదాయాన్ని పొందేందుకు ఆసక్తి చూపిస్తాయి.
- ఇది ద్రవ్య సరఫరాను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
SLR – Statuatory Liquidity Ratio (చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి) - వాణిజ్య బ్యాంకులు తాము సేకరించిన డిపాజిట్లలో నిర్దిష్ట మొత్తాన్ని బంగారం తదితర విలువైన లోహాలు, ఇంకా ప్రభుత్వ బాండ్ల రూపంలో ఉంచాలి.
- ఎస్ఎల్ఆర్ ద్వారా డిపాజిటర్ల సొమ్ముకు ఆర్బీఐ భద్రతనిస్తుంది.
- ఎస్ఎల్ఆర్ బ్యాంకుల నియంత్రణ చట్టం, 1949లో సెక్షన్ 24 (2ఎ) ద్వారా నిర్దేశించారు.
నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్ – క్యాష్ రిజర్వ్ రేషియో)
- ప్రతి వాణిజ్య బ్యాంకు తాను ప్రజల నుంచి వసూలు చేసే డిపాజిట్లలో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంక్ వద్ద జమచేయాలి. దీన్నే సీఆర్ఆర్ అంటారు.
- డిపాజిటర్ల రక్షణ కోసం దీన్ని ప్రారంభించారు.
- సీఆర్ఆర్కి ఆర్బీఐ ఎలాంటి వడ్డీ చెల్లించదు.
- సీఆర్ఆర్కి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి మధ్య విలోమానుపాతం ఉంటుంది.
- సీఆర్ఆర్ పెరిగితే బ్యాంకుల రుణాల సామర్థ్యం తగ్గుతుంది. సీఆర్ఆర్ తగ్గితే బ్యాంకుల రుణాల సామర్థ్యం పెరుగుతుంది.
ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ- మానిటరీ పాలసీ కమిటీ )
- భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934ను ఆర్థిక చట్టం 2016 ద్వారా సవరించి, ద్రవ్య విధాన కమిటీకి చట్టబద్ధమైన, సంస్థాగతమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందించడానికి, ధరల స్థిరత్వాన్ని కొనసాగించడాన్ని వృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఇచ్చారు.
- ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత లక్ష్యస్థాయిలో నియంత్రించేందుకు బెంచ్‌మార్క్ పాలసీ రేటు (రెపోరేటు)ను నియంత్రించే బాధ్యతను ఎంపీసీకి అప్పగించారు.
- ఎంపీసీ సమావేశాలు సంవత్సరానికి కనీసం నాలుగుసార్లు నిర్వహించి, సమావేశం తర్వాత తన నిర్ణయాలను ప్రచురిస్తుంది.
- ఎంపీసీలో ఆరుగురు సభ్యులు ఉంటారు.
- ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి మరో ముగ్గురిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.
- ఎంపీసీని భారతీయ రిజర్వ్‌బ్యాంక్ చట్టం, 1934లోని సెక్షన్ 45ZB ప్రకారం ఏర్పాటు చేసి, అధికారాలు ఇచ్చారు.
- ఎంపీసీని 2016, సెప్టెంబర్ 29న కేంద్ర ప్రభుత్వం గెజెట్ ద్వారా ఏర్పాటు చేసింది.
- చైర్పర్సన్ – ఆర్బీఐ గవర్నర్
- ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, ఆర్బీఐ కేంద్ర బోర్డ్ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు.
- కేంద్రప్రభుత్వం నియమించిన సభ్యులు నాలుగు సంవత్సరాలు కొనసాగుతారు.
ఎంపీసీలో ప్రస్తుతం ఉన్నవారు
1. శక్తి కాంత దాస్
2. మైఖేల్ దేబబ్రత పాత్ర
3. రాజీవ్ రంజన్
4. అషిమా గోయల్
5. శశాంక భీడె
6. జయంత్ వర్మ
- సమావేశాల్లో నిర్ణయాలపై ఓటింగ్ నిర్వహించినప్పుడు 3:3 అంటే సమానమైనప్పుడు ఛైర్పర్సన్ నిర్ణాయక ఓటు హక్కు కలిగి ఉంటారు.
- ఎంపీసీని ఏర్పాటు చేయాలని కింది కమిటీలు ప్రతిపాదించాయి
1. వై.వీ రెడ్డి కమిటీ (2002)
2. తారాపోర్ కమిటీ (2006)
3. పెర్సీ మిస్త్రీ కమిటీ (2007)
4. రఘురాం రాజన్ కమిటీ (2009)
5. ఉర్జిత్ పటేల్ కమిటీ (2013)
భారతీయ రిజర్వ్ బ్యాంక్
- భారతీయ ఆర్థిక వ్యవస్థపై ఏర్పాటు చేసిన హిల్టన్ యంగ్ కమిషన్ (1926) సూచనల మేరకు ఆర్బీఐను ఏర్పాటు చేశారు.
- హిల్టన్ యంగ్ కమిషన్‌ను రాయల్ కమిషన్ అని పిలుస్తారు.
- ఆర్బీఐ ఏర్పాటు – 1935, ఏప్రిల్ 1
- దీన్ని ఆర్బీఐ చట్టం, 1934 ప్రకారం ఏర్పాటు చేశారు.
- ప్రారంభంలో దీని ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో నెలకొల్పారు. 1937 నుంచి శాశ్వతంగా ముంబయికి మార్చారు.
- ప్రారంభ పెట్టుబడి – రూ. 5 కోట్లు (ఒక్కొక్క షేరు విలువ రూ.100లతో మొత్తం 5 లక్షల షేర్లువిడుదల చేశారు)
- మొదటి గవర్నర్ – సర్ ఓస్ బర్న్ స్మిత్ (1935 – 1937)
- మొదటి భారతీయ గవర్నర్ – సర్ సీ.డీ. దేశ్‌ముఖ్ (1943 – 1949)
- ఎక్కువ కాలం గవర్నర్‌గా పనిచేసింది – సర్ బెనగళ్ రామారావ్ (1949-1957) – 7 సం.రాల 197 రోజులు
- తక్కువ కాలం గవర్నర్‌గా పనిచేసింది – అమితవ్ ఘోష్ (1985) – 20 రోజులు
- ప్రస్తుత గవర్నర్ – శక్తికాంత దాస్ (25వ గవర్నర్) (2018 డిసెంబర్ 12 నుంచి)
- రూ. 500, 1000 నోట్లను రద్దు చేసినప్పటి గవర్నర్ – ఉర్జిత్ పటేల్
- 1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన గవర్నర్ – ఎస్. వెంకట్రామన్
- ఆర్బీఐకి సాధారణంగా ఒక గవర్నర్ & నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు.
- పదవీ కాలం 3 సంవత్సరాలు, వీరి కాలం పొడిగించవచ్చు.
ప్రస్తుత గవర్నర్ & డిప్యూటీ గవర్నర్లు
- శక్తికాంత దాస్ (గవర్నర్)
- ఎం.డీ పాత్ర, ఎం. రాజేశ్వరరావు, టి. రవి శంకర్, జే స్వామినాథన్ (డిప్యూటీ గవర్నర్లు)
ఆర్బీఐ – భారతీయ కేంద్ర బ్యాంక్ఆర్బీఐ విధులు
- ద్రవ్య అధికారం
- ఆర్థిక వ్యవస్థ నియంత్రణ, పర్యవేక్షణ
- విదేశీ మారక ద్రవ్య నిర్వహణ
- కరెన్సీ విడుదల
- జాతీయ లక్ష్యాల అభివృద్ధిలో పాత్ర
- చెల్లింపులు, సెటిల్మెంట్ వ్యవస్థల పర్యవేక్షణ, నియంత్రణ
- బ్యాంకర్స్ బ్యాంక్
- బ్యాంకర్ టు గవర్నమెంట్
- లెండర్ టు లాస్ట్ రిసార్ట్
- రుణ నిర్వహణ
- భారతీయ రిజర్వ్ బ్యాంక్‌కు 33 చోట్ల కార్యాలయాలున్నాయి.
- ఆర్బీఐ 5 ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కలిగి ఉంది.
1. ఆర్బీఐ అకాడమీ – ముంబయి
2. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్ – పుణె
3. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ కాలేజీ – చెన్నై
4. కాలేజ్ ఆఫ్ సూపర్వైజర్స్ – ముంబయి
5. ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (IDRST) – హైదరాబాద్ (1966)
ఆర్బీఐ నుంచి నిధులు అందుకొంటున్న సంస్థలు
1. Centre for Advanced Financial Research and Training (CAFRAL)
2. Indira Gandhi Institute of Development Research (IGIDR)
3. Indian Institute of Bank Management (IIBM) – Guwahati
4. National Institute of Bank Management (NIBM)- pune
– తాన్న రవి ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్ , వికారాబాద్
91107 62187
Read Today's Latest Current-affairs News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

