Tithi Bhojan | పేరు తీవ్ర వివాదస్పదం.. 30 నుంచి బడి పిల్లలకు తిథి భోజనం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఏమాత్రం సోయిలేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఒక పేరు తీవ్ర వివాదస్పదమైంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈ నెల 30 నుంచి పాఠశాలల్లో ‘తిథి భోజనం’ అనే కొత్త కార్యక్రమం ప్రారంభించాలని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి శుక్రవారం డీఈవోలకు ఆదేశాలు జారీచేశారు.
- మధ్యాహ్న భోజనంలో కొత్త కార్యక్రమం
- తెలంగాణ సోయి లేకుండా పేరు పెట్టిన విద్యా శాఖ
- అశుభ దినాలను సూచించే పదమని టీచర్లు, పేరెంట్స్ ఆగ్రహం
- తక్షణమే పేరు మార్చాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
- ఇది కేంద్రం పెట్టిన పేరంటూ సమర్థించిన విద్యాశాఖ డైరెక్టర్
Tithi Bhojan | హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఏమాత్రం సోయిలేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఒక పేరు తీవ్ర వివాదస్పదమైంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈ నెల 30 నుంచి పాఠశాలల్లో ‘తిథి భోజనం’ అనే కొత్త కార్యక్రమం ప్రారంభించాలని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి శుక్రవారం డీఈవోలకు ఆదేశాలు జారీచేశారు. ‘తిథి భోజనం’లో భాగంగా పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అదనపు ఆహార పదార్థంగా అందించాలని ఆదేశించారు. పాఠశాలలవారీగా కమ్యూనిటీ సభ్యులు ప్రత్యేక సందర్భాల్లో లేదా పండుగ రోజుల్లో అదనపు పదార్థంగా, పూర్తి భోజనంగా స్వీట్లు, పండ్లు, నామ్కీన్ వంటి రూపాల్లో అందించాలని సూచించారు. అయితే, పండుగలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో బడి పిల్లలకు పెట్టే భోజనానికి ‘తిథి భోజనం’ అనే పేరు పెట్టడం పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
చనిపోయినవారికి ఏడాదికోసారి పెట్టే తద్దినాన్ని ‘తిథి’ అంటారనే కనీస సోయి లేకుండా బడి పిల్లలకు పెట్టే భోజనానికి ‘తిథి భోజనం’ అనే పేరు పెట్టడమేమిటని తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అశుభ దినాలకు ఉద్దేశించిన పదాన్ని బడి పిల్లల భోజనానికి పెట్టడం తగదని, మరో పేరు నిర్ణయించాలని పలువురు విజ్ఞులు సూచిస్తున్నారు. చివరకు వామపక్ష భావజాలం ఉన్న యూటీఎఫ్ టీఎస్ రాష్ట్ర నాయకుడు చావ రవి కూడా ‘తిథి భోజనం’ అనే పేరు పెట్టడం సమంజసం కాదని, ఈ పేరును తక్షణమే మార్చాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధిల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం సానుకూలంగా స్పందించడం లేదు.
ఈ పేరును కేంద్ర ప్రభుత్వం పెట్టిందని, ఇది సంస్కృత పదమని, దీనికి మంచి అర్థమే ఉన్నదని, ఈ పేరు పట్ల అభ్యంతరాలు పెట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చని సమర్థించుకుంటున్నారు. తిథి భోజనం వల్ల పాఠశాల, స్థానిక ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందిస్తుందని, అన్ని వర్గాల పిల్లల్లో సమానత్వ భావన కలుగడానికి సహాయపడుతుందని విద్యాశాఖ డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సప్లిమెంటరీ న్యూట్రీషన్ల ద్వారా ‘తిథి భోజనం’ పాఠశాల పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి దోహదపడుతుందని తెలిపారు. ‘తిథి భోజనం’ అమలు కోసం తిథి భోజన కార్యక్రమాన్ని జియోట్యాగ్ చేసిన ఫోటోలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గూగుల్ డ్రైవ్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం పోషణ్’ కార్యక్రమంలో భాగంగా ‘తిథి భోజనం’ అమల్లోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

