Kanwariyas attack | కన్వరియాస్ కర్రలతో కొడుతుంటే ప్రాణభయంతో పరుగులు.. ఏం జరిగిందంటే..!
Kanwariyas attack | కన్వర్ యాత్రికులు నడిరోడ్డుపై ఓ కారులోని నలుగురు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మూక దాడికి పాల్పడ్డారు. కర్రలతో కారు అద్దాలు పగులగొట్టారు. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు కారు దిగి ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే కన్వర్ యాత్రికులు వెంబడించి మరీ కర్రలతో చితకబాదారు.
Kanwariyas attack : కన్వర్ యాత్రికులు నడిరోడ్డుపై ఓ కారులోని నలుగురు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మూక దాడికి పాల్పడ్డారు. కర్రలతో కారు అద్దాలు పగులగొట్టారు. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు కారు దిగి ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే కన్వర్ యాత్రికులు వెంబడించి మరీ కర్రలతో చితకబాదారు. చివరికి వారిలో ముగ్గురు వ్యక్తులు తప్పించుకుని పారిపోగలిగినప్పటికీ.. ఒక వ్యక్తి దొరికిపోయాడు. దాంతో అతడిని విపరీతంగా కొట్టారు. ఒంటిపై దుస్తులను చించేశారు.
मेरठ में कांवड़ियों द्वारा कार तोड़ने का Live Video –
कार में 4 मुस्लिम युवक सवार थे। कांवड़ियों ने जैसे ही डंडे बरसाने शुरू किए, 3 युवक उतरकर भाग निकले। एक युवक हाथ आ गया। उसकी खूब पिटाई हुई।
कांवड़ियों का आरोप है कि कार चालक ने टक्कर मारकर कांवड़ खंडित कर दी। https://t.co/4J4LFpU0DN pic.twitter.com/TztXZnyBK9
— Sachin Gupta (@SachinGuptaUP) July 26, 2024
అయితే కన్వర్ యాత్రికులలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి కారణం వారు తీసుకెళ్తున్న కన్వర్‌ను ఆ నలుగురు కారుతో ఢీకొట్టడమే. తాము కన్వర్ కోసం హరిద్వార్ నుంచి పవిత్ర జలాన్ని తీసుకుని వెళ్తున్నామని, ఇంతలో నలుగురు వ్యక్తులు రాంగ్రూట్లో వచ్చి కన్వర్ ఢీకొట్టారని, రావద్దని తాము సైగలు చేసినా వాళ్లు వినిపించుకోలేదని కన్వర్ యాత్రికులు చెప్పారు. కారుతో గుద్దడంతో కన్వర్ దెబ్బతిన్నదని తెలిపారు.
కానీ, నడిరోడ్డుపై కన్వర్ యాత్రికుల వీరంగం చూసి వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంగాక కాసేపు ఆయోమయానికి లోనయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
उत्तर प्रदेश : मेरठ में कार की टक्कर लगने के बाद कांवड़ियों ने कार सवार एक युवक को पकड़ लिया। उसको खूब पीटा। कपड़े फाड़ दिए। 2 युवकों ने भागकर जान बचाई। कांवड़िए कह रहे थे कि टक्कर लगने से कांवड़ खंडित हो चुकी है।
📽️@hindipatrakar https://t.co/BK1S7WN5cl pic.twitter.com/N1UZiQQG4G— Sachin Gupta (@SachinGuptaUP) July 26, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

