Teachers Transfer | వెబ్ ఆప్షన్స్‌లో పాఠశాల పేరు మాయం.. టీచర్లు లేక పాఠాలు బోధించుకుంటున్న విద్యార్థులు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఉపాధ్యాయులను నియమించకపోవడంతో నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట శుక్రవారం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులు ఉండగా..74 మంది విద్యనభ్యసిస్తున్నారు.
- పాఠశాల ఎదుట గ్రామస్థులు, తల్లిదండ్రుల ఆందోళన
Teachers Transfer | లింగాల, జూలై 26 : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఉపాధ్యాయులను నియమించకపోవడంతో నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట శుక్రవారం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులు ఉండగా..74 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఐదుగురు ఉపాధ్యాయులు ఉండగా.. ఇటీవల చేపట్టిన బదిలీల్లో హెచ్ఎం అంజిలాల్తోపాటు నలుగురు ఎస్జీటీలు వేరే చోటకు వెళ్లారు. విద్యాశాఖ అధికారులు వెబ్ఆప్షన్స్లో కోమటికుంట పాఠశాల పేరును చూపించకపోవడంతో ఆ స్థానాలు భర్తీ కాలేదు.
టీచర్లు లేకపోవడంతో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటివారికి పాఠాలను బోధించాల్సిన దుస్థితి ఏర్పడింది. హెచ్ఎం అంజిలాల్ వటవర్లపల్లికి బదిలీ కాగా.. డీఈవో ఆదేశాల మేరకు కోమటికుంట పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక గదిలో ఒకటి నుంచి 3 తరగతుల వరకు, మరో గదిలో 4 నుంచి 7 తరగతుల వరకు పాఠాలు బోధిస్తున్నారు. ఉపాధ్యాయుడు నరేశ్ నారాయణపేట జిల్లాకు బదిలీ కాగా.. అతడిని కోమటికుంటలో కొన్ని రోజులు విధులు నిర్వర్తించాలని డీఈవో ఆదేశించారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఎప్పుడు బదిలీపై వెళ్తారో తెలియడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పాఠశాలకు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను నియమించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీనిపై ఎంఈవో చంద్రుడును వివరణ కోరగా.. త్వరలోనే ఉపాధ్యాయులను నియమిస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

