‘సంగతత్వం, సరళత్వం, నాణ్యత’
NCF-2005, NCFSE-2023 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం
- Curriculum అనే ఆంగ్ల భాషా పదం currere (or) cure అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. అంటే గమ్యాన్ని చేరే మార్గం అని అర్థం.
- Curriculum కి ఆధారిత విద్య- మహాత్మాగాంధీ (బేసిక్ విద్య)
- Curriculum సిఫారసు – మొదలియార్, కొఠారీ కమిషన్లు
- Curriculum కి ఆధార పుస్తకం – Civili zation and Progress రచయిత-రవీంద్రనాథ్ ఠాగూర్
- NCFలో మొదటి వాక్యం సృజనాత్మకత, సహజసిద్ధమైన ఆనందం, బాల్యానికి మూలం- రవీంద్రనాథ్ ఠాగూర్
గమనిక: కొఠారీ నివేదికలోని మొదటి వాక్యం- భారతదేశ గమ్యం తరగతి గదిలో రూపుదిద్దుకొంటుంది.
- ప్రణాళిక లక్ష్యం- SMART
S- Specific- కచ్చితం
M- Measure- కొలవదగిన
A- Ambitious లక్ష్యాత్మకత
R- Reality- వాస్తవికత
T- Time Bond నిర్దిష్ట కాలానికి లోబడి - విద్యా ప్రణాళిక రకాలు-3
1. విషయ ఆధారిత -NCF 1975, NCF 1988 ప్రాధాన్యం ఇచ్చింది
2. కార్యకలాపాలు, కృత్యాల ఆధారిత-గాంధీజీ సమర్థించడం
3. అనుభవాలు/పరిసరాల ఆధారిత - భారతదేశంలోని NCFల సంఖ్య-6
- NCF 1975-1988 జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా
- NCF1988- NPE 1986కి అనుగుణంగా వచ్చింది
NPE-1986 సూచించిన 10 అంశాలు - భారతదేశ స్వాతంత్యోద్యమ చరిత్ర
- భారత రాజ్యాంగ విధి విధానాలు
- జాతీయ సమైక్యత భావాన్ని సంరక్షించడానికి అవసరమయ్యే అంశాలు
- జాతీయ సాంస్కృతిక వారసత్వం
- ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికవాదం
- స్త్రీ, పురుష లేదా లింగ సమానత్వం
- పర్యావరణ పరిరక్షణ
- సామాజిక అవరోధాల నిర్మూలన
- చిన్న కుటుంబాల ఆవశ్యకత
- శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం
- NCF 2000,NCF 2005- దీనికి అధ్యక్షుడు యశ్పాల్
- యశ్పాల్ 1992-1993
- విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రతిభను గుర్తించి గౌరవించే ఉద్దేశంతో జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ మొదలైనవి విద్యార్థుల్లో అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి బృంద కార్యకలాపాలు ఉండాలి.
- పూర్వ ప్రాథమిక స్థాయిలో చిన్నారులకు రాయడం, చదవడం, గణితాన్ని నేర్పించడం, అవసరానికి మించి నేర్పే ప్రయత్నాన్ని చేస్తున్నాయి. ఇది చిన్న పిల్లలపై హింసను పెంచడమే.
- ప్రాథమిక పాఠశాల వరకు స్కూల్ బ్యాగ్‌ను దాంతోపాటు ఇంటిపనిని నిషేధించాలి.
- ఇంటిపని ఇవ్వదలిస్తే పాఠ్య గ్రంథేతరంగా ఉండాలి.
- ఉపాధ్యాయులకు టీఎల్ఎం కోసం వారి వేతనాల్లో 10 శాతానికి తగ్గకుండా నిధులు మంజూరు చేయాలి.
- నర్సరీ తరగతుల్లో ప్రవేశం కోసం పరీక్షలు నిర్వహించొద్దు.
- పుస్తకాలు పాఠశాల ఆస్తి. వాటిని ప్రతిరోజు ఇంటికి మోయడం మాన్పించాలి.
- క్రిషిదర్శన్ వంటి టీవీ కార్యక్రమాల మాదిరిగా శిక్షాదర్శన్ వంటి కార్యక్రమం ఉండాలి.
- పిల్లల స్కూల్ బ్యాగ్ చట్టం-2016ను అనుసరించి విద్యార్థి శరీర బరువులో 10 శాతం మించరాదు.
- పాలసీ ఆన్ స్కూల్ బ్యాగ్-2020 SCERT వారిని అనుసరించి 1, 2వ తరగతులకు ఇంటిపని లేదు. బ్యాగు బరువు 1.5 కేజీలు ఉండాలి.
- 3, 4, 5వ తరగతులకు పాఠశాలలోనే వర్క్‌బుక్, బ్యాగు బరువు 2.5 కేజీలు ఉండాలి.
- 6, 7 తరగతులకు 4 కేజీల బరువు, 8, 9 తరగతులకు 4.5 కేజీలు, 10వ తరగతికి 5 కేజీల బరువు ఉండాలి.
NCFFS -2022
- 2022, అక్టోబర్ 20న కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు సమర్పించారు.
NCFSC-2023
- 2023, జూలై 29న కస్తూరి రంగన్ అధ్యక్షుడు విద్యా మంత్రిత్వ శాఖ ధర్మేంద్ర ప్రధాన్‌కు సమర్పించారు.
- కరికులమ్ అంటే..
1. విద్యార్థి భావి జీవితంలో స్థిరపడటానికి పాఠశాల అందించే విద్యా కార్యక్రమాలు మొత్తం- క్వార్టర్.వి.గుడ్
2. విద్యార్థి విద్యా విషయాలతో పాటు అతడు పొందే రోజువారీ అనుభవాల మొత్తం- మొదలియార్
3. భారతదేశ విద్య అభివృద్ధికి కరికులమ్ ఒక సాధనంగా ఉపయోగపడాలి-NPE 1986 - సంగతత్వం, పరివర్తనశీలత, సమానత్వం కలిస్తేనే కరికులమ్-POA 1992
- భారం లేని విద్య – యశ్పాల్ (1993)
- NCF-2005 ఉద్దేశం- జ్ఞాన నిర్మాణం
- NCF దృక్పథం – సంగతత్వం, సరళత్వం, నాణ్యత
NCF మార్గదర్శక సూత్రాలు
- విద్యార్థి పాఠశాల వెలుపల జీవితాన్ని జ్ఞానాన్ని మన బోధనతో అనుసంధానం చేయాలి.
- కంఠస్థం లేదా బట్టీ పట్టే పద్ధతుల నుంచి దూరం చేయాలి.
- విద్యార్థి పాఠ్య పుస్తకాల్లో చిక్కుకునేలా కాకుండా విద్యార్థి సంపూర్ణ వికాసానికి తోడ్పడేలా మన పాఠ్యాంశాలను రూపొందించుకోవాలి.
- పరీక్షలను సరళీకరించి తరగతి జీవితంలో ఐక్యం చేయాలి.
- దేశ ప్రజాస్వామిక నియమాలకు లోబడి పిల్లల ఆసక్తులను అభివృద్ధి పరచాలి.
- బోధనా అభ్యసన నియమం – నిర్మాణాత్మక అభ్యసనం.
NCF మొత్తం అధ్యాయాలు 5
అధ్యాయం-1 దృక్పథం
- రాజ్యాంగ పద్ధతులు, స్త్రీ పురుష సమానత్వం, ఎస్సీ ఎస్టీల వారి అవసరాలు
- దివ్యాంగుల సమస్యలపై దృష్టిని కేంద్రీకరించి అందరు దేశ అభివృద్ధిలో పాల్గొనే పౌరులుగా తీర్చిదిద్దాలి.
అధ్యాయం-2 అభ్యసనం-జ్ఞానం
- అభ్యాసకులకు, అభ్యసనానికి మధ్యగల సంబంధాలపై ఉపాధ్యాయుడు ధనాత్మక దృక్పథాన్ని పెంపొందించుకోవాలి.
- జ్ఞాన నిర్మాణానికి సృజనాత్మకతను వేగవంతం చేసుకోవడానికి అభ్యాసకుల భాగస్వామ్యం ప్రధానం.
- విద్యార్థి తరగతిలో స్వేచ్ఛగా ప్రశ్నించడానికి అవకాశాలు
- ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా క్రియాశీల అభ్యసనం
- వివిధ సబ్జెక్టుల మధ్య జ్ఞానాన్ని అనుసంధాన పరచడం ద్వారా అంతర దృష్టిని పెంపొందించవచ్చు. అంటే విశ్లేషణ, సంశ్లేషణ, అన్వేషణ, విమర్శ వంటివి పెంపొందించవచ్చు.
- విస్తృతమైన సామాజిక పరిసరాల్లో అభ్యసనం
- విద్యార్థి సామర్థ్యాలన్నీ వికసించే దశ పాఠశాల దశ- ఉత్తర బాల్య దశ
- అధ్యాయం-3 పాఠశాల స్థాయిలు, పాఠ్యాంశాలు, మూల్యాంకనం
- భాష (మాతృభాష)
- పాఠ్యపుస్తక సరిహద్దులను దాటి భాషను బోధించాలి.
- ఇతర రాష్ర్టాల విద్యార్థులు ఉన్నప్పుడు వారి మాతృభాషకు 6 నెలల నుంచి రెండు సంవత్సరాల అవకాశాలను కల్పిస్తూ ద్వి భాషా సూత్రాన్ని అనుసరించారు.
గమనిక: గిరిజన విద్యార్థికి వర్తిస్తుంది.
- ఆంగ్లం అనేది బహుభాషా తత్వాన్ని పెంపొందించడం కోసం
- గణితం అనేది సూత్రీకరణ విధానాలను వివరించాలి.
- సమస్యా పరిష్కరణ దిశగా, అమూర్త నిర్వహణ దిశగా, తార్కిక ఆలోచనా సామర్థ్యాలను పెంపొందించే విధంగా నాణ్యమైన గణిత విద్య ఉండాలి.
- సైన్సు అనేది పర్యావరణం పాఠశాల జీవితంలో అంతర్భాగం కావాలి.
- సృజనాత్మకత, కుతూహలత్వాన్ని పెంపొందించే విధంగా సైన్స్ బోధన ఉండాలి.
- సైన్స్ కృత్యాలు, ప్రయోగ కృత్యాలు శ్రమ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఉపయోగపడేలా ఉండాలి.
- సాంఘికశాస్త్రం సొంతంగా ఆలోచించేలా సమాజంపై విమర్శనాత్మకంగా ప్రతిస్పందించేలా తగిన నైతిక, మానసిక శక్తులను పెంపొందించేలా సాంఘికశాస్త్ర బోధన ఉండాలి.
- పౌర గుర్తింపు కీలక అంశం.
- గతంపై ధనాత్మక దృక్పథాలను పెంపొందించుకునేలా చరిత్ర ఉండాలి.
- పౌరశాస్ర్తాన్ని పొలిటికల్ సైన్స్‌గా మార్చాలి. గమనిక: 1757 నుంచి 1947 వరకు ఉన్న విద్యను వలసవాద విద్య అంటారు. ఈ కాలంలో వచ్చి చేరినదే పౌరశాస్త్రం.
- కళ, ఆరోగ్య, పని, విద్యలతో పాటు ఉపాధ్యాయ విద్య శిక్షణలో శాంతి అంశాన్ని సబ్జెక్టుగా చేర్చాలి.
అధ్యాయం-4 తరగతి, పాఠశాల వాతావరణం
- ICT చర్య, ప్రతిచర్య రూపంలో ఉండాలి. సంగ్రహణ కోసం ఉండరాదు.
- సెలవుల్లో లేదా వేసవి సెలవుల్లో తెరిచిఉంచాల్సిన విభాగం గ్రంథాలయం విరామ సమయ సద్వినియోగం కోసం
- ప్రతి ఒక్క తరగతి వారానికి ఒక్కసారైనా గ్రంథాలయాన్ని సందర్శించాలి.
- ఉపాధ్యాయుల బాధ్యతలు
అధ్యాయం-5 సంస్థాగత సంస్కరణలు
- 73వ రాజ్యాంగ సవరణను అనుసరించి గ్రామాల్లో పాఠశాలల బాధ్యత పంచాయతీరాజ్‌లకు అప్పగించాలి.
- ఉపాధ్యాయులకు ఐదు సంవత్సరాల సర్వీసులో 2 నుంచి 3 నెలలు వృత్తి అంతర శిక్షణ ఉండాలి.
- ఏ పాఠశాలకు ఆ పాఠశాల వారి బోధనా అభ్యసనను వారే పర్యవేక్షణ చేసుకోవాలి.
- అన్ని స్థాయిల్లో ఉపాధ్యాయ విద్య శిక్షణా కోర్సు ఉండాలి.
- ఇంటర్‌కు సమానంగా డీఈడీ, డిగ్రీకి సమానంగా బీఈడీ, పీజీకి సమానంగా ఎంఈడీ.
- భాషా పండితులకు కూడా శిక్షణ ఉండాలి
- శిక్షణా సమయంలో ఉపాధ్యాయులు వారి భాషా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.
- బాలికలకు వెయిటింగ్ రూమ్ వసతి ఉండాలి.
- మన పాఠశాలల్లో ఉపయోగించే భాష ‘ఆక్షేపనీయం’ అందువల్ల పిల్లల మానసిక గౌరవం కోసం పేర్లతో పిలవాలి.
- బహుళ పాఠ్యపుస్తకాలు ఉండాలి.
గమనిక: NCFSE-1988 పైన 1990 SCERT ఒక కమిటీని వేసి 1994 నుంచి 1999 వరకు అమలు చేశారు.
- NCF 2005 పై 2008లో కమిటీ వేసి SCERT 2009-2010 విద్యా సంవత్సరం నుంచి మన రాష్ట్రంలో అమలు జరిపారు.
- మన రాష్ట్రం 2011లో అభివృద్ధి పరిచినది – SCF (State Curriculum Frame work)
NCFSE-2023
- దీనిలో 5 అధ్యాయాలు ఉన్నాయి.
అధ్యాయం-1 ఉపగమం
అధ్యాయం-2 క్రాస్ కటింగ్ థీమ్
అధ్యాయం-3 పాఠశాల సబ్జెక్టు
అధ్యాయం-4 పాఠశాల సంస్కృతి, ప్రక్రియలు
అధ్యాయం-5 సహాయక పర్యావరణ వ్యవస్థను సృష్టించడం
- ప్రధాన లక్ష్యం- పాఠశాల విద్యను సానుకూలంగా మార్చటంలో సహాయపడటం, ఆలోచనలతో పాటు విద్యలో పద్ధతులను మార్చటానికి సహాయం చేస్తుంది. 21వ శతాబ్దపు కీలక నైపుణ్యాలు కలిగి ఉన్న సంపూర్ణ, సుసంపన్నమైన వ్యక్తులను సృష్టించడం.
- ఈ NCF సమర్థించిన తత్వం ఆదర్శవాదం, వ్యవహారిక సత్తావాదం
- ఈ విద్యకు సంబంధించిన లక్ష్యాలు
1. హేతుబద్ధమైన ఆలోచన, స్వయం ప్రతిపత్తి
2. ఆరోగ్యం, శ్రేయస్సు
3. ప్రజాస్వామ్యం, సమాజ భాగస్వామ్యం
4. ఆర్థిక భాగస్వామ్యం
5. సాంస్కృతిక భాగస్వామ్యం
- NPE-2020లో పేర్కొన్న 5+3+3+4 విద్యా విధానాన్ని అనుసరించి పునాది పూర్వక దశ అనేది భారతీయ సంప్రదాయంలో పంచకోశ విధానం అనుగుణంగానే కొనసాగుతుంది. అవి..
ఎ. అన్నమయ కోశ అంటే శారీరక, బౌద్ధిక అభివృద్ధి. దీన్నే శారీరక వికాస్ అని కూడా అంటారు.
బి. ప్రాణమయ కోశ అంటే జీవిత శక్తి దీన్నే ప్రాణిక్ వికాస్ అంటారు.
సి. మనోమయ కోశ అంటే భావోద్వేగ, మానసిక అభివృద్ధి. దీన్నే మానసిక వికాస్ అని అంటారు.
డి. విజ్ఞానమయ కోశ అంటే మేధోమథనం. దీన్నే బుద్ధిక్ వికాస్ అంటారు.
ఇ. ఆనందమయ కోశ అంటే ఆధ్యాత్మికత అభివృద్ధి. దీన్నే చైస్థిక వికాస్ అని అంటారు. - జ్ఞానాన్ని పెంపొందించటంలో భారతదేశం జ్ఞాన సంబంధ సిద్ధాంతంపై, అభ్యాసంపై ఆలోచన కలిగి ఉంది. అందువల్ల సంప్రదాయ భారతీయ తత్వశాస్త్రంలోని 9 దర్శనాల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. అవి..
1. న్యాయ, 2. వైశేషిక, 3.సాంఖ్య, 4. యోగ, 5. మీమాంస, 6. వేదాంత, 7.బౌద్ధ, 8.జైన, 9. లోకాయుత/చార్వాక
మూల్యాంకనం
- 1,2 తరగతులకు పరీక్షలు ఉండరాదు.కానీ మూల్యాంకనం ఉండాలి.
- మూల్యాంకనం నిమిత్తం పాఠశాల డైరీని ఉపయోగించాలి.
- 3వ తరగతి నుంచి పరీక్షలు, 5వ తరగతి నుంచి స్వీయ మూల్యాంకనాన్ని కూడా ప్రోగ్రెస్ కార్డులో నమోదు చేయాలి.
- 10, 12వ తరగతుల్లో 25 శాతం నుంచి 40 శాతం లిఖిత పూర్వక ప్రశ్నలు మిగిలినవి బిట్ల రూపంలో ఉండాలి.
- Pass/Fail అనే పదాలను తొలగించాలి.
- ఉత్తీర్ణుడు కాకపోతే మళ్లీ పరీక్షకు సిఫారసు అని రాయాలి.
- ప్రవేశ పరీక్ష పద్ధతులను రూపొందించి, నిర్వహించడానికి నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి.
- గమనిక: కళ, ఆరోగ్య, వ్యాయామ మొదలగు విద్యకు పరీక్షలు ఉండరాదు. కానీ మూల్యాంకనం ఉండాలి.
– దుర్గాప్రసాద్
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్,
వికారాబాద్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

