Whale | సముద్రంలో చేపల వేట బోటుపై దాడి చేసిన భారీ తిమింగలం.. షాకింగ్ వీడియో
Whale | అమెరికాలోని న్యూహాంప్‌షైర్ (New Hampshire)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ప్రోట్స్‌మౌత్ హార్బర్ సముద్రంలో ఓ భారీ తిమింగలం (Whale) చేపల వేట పడవపై (vessel capsizes) దాడి చేసింది.
Whale | అమెరికాలోని న్యూహాంప్‌షైర్ (New Hampshire)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ప్రోట్స్‌మౌత్ హార్బర్ సముద్రంలో ఓ భారీ తిమింగలం (Whale) చేపల వేట పడవపై (vessel capsizes) దాడి చేసింది. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి బోటుపై పడింది. దీంతో పడవ బోల్తా పడింది. అయితే, అదృష్టవశాత్తూ అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది.
ఒడియోర్న్ పాయింట్ స్టేట్ పార్క్ సమీపంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. 23 అడుగుల సెంటర్ కన్సోల్ బోట్లో ఇద్దరు వ్యక్తులు మంగళవారం ఉదయం చేపల వేటకై సముద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఓ భారీ తిమింగలం వారి బోటు సమీపానికి వచ్చింది. అనంతరం నీటి లోంచి గాల్లోకి లేచి బోటుపై పడింది. దీంతో బోటు ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బోటులోని ఇద్దరి వ్యక్తుల్లో ఒకరు సముద్రంలోకి దూకేశారు. మరో వ్యక్తి నీటిలో మునిగిపోయారు. ఇదంతా గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని వారిని సురక్షితంగా కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
#Whale lands on #boat pic.twitter.com/AZwV2hsqFT
— Beney de Saxonne (@SergueyB) July 24, 2024
Also Read..
Ethiopia | కొండచరియలు విరిగిపడిన ఘటనలో 229కి పెరిగిన మృతులు
Encounter | కుప్వారాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాదిని హతమార్చిన బలగాలు
Fire Accident | జియాగూడలో భారీ అగ్నిప్రమాదం.. పదేండ్ల బాలిక మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

