Divorce | ఇదేందయ్యా ఇదీ..! పెళ్లయిన మూడు నిమిషాలకే భర్తకు విడాకులు..! కారణం ఏమై ఉంటుందంటరూ..!
Divorce | పెళ్లయిన నెలలు కాదు.. గంటలు కూడా కాలేదు. మూడు నిమిషాల్లోనే ఓ జంట విడాకుల కోసం కోర్టుకెక్కింది. వినడానికే విడ్డూరంగా ఉన్నా.. విడాకులు నిజమేనండి బాబూ..! ఈ ఘటన ఎక్కడ జరిగింది ? కారణాలు ఏంటో తెలుసుకుంటే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే..!
Divorce | పెళ్లయిన నెలలు కాదు.. గంటలు కూడా కాలేదు. మూడు నిమిషాల్లోనే ఓ జంట విడాకుల కోసం కోర్టుకెక్కింది. వినడానికే విడ్డూరంగా ఉన్నా.. విడాకులు నిజమేనండి బాబూ..! ఈ ఘటన ఎక్కడ జరిగింది ? కారణాలు ఏంటో తెలుసుకుంటే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే..! వెళితే.. ఈ విడాకుల ఘటన కువైట్‌లో చోటు చేసుకున్నది. పెళ్లయిన మూడు నిమిషాలకు జంట కోర్టును ఆశ్రయించగా.. కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. పెళ్లి తంతు పూర్తయ్యాక పెళ్లి వేడుక నుంచి వెళ్తున్న సమయంలో పెళ్లికూతురు బ్యాలెన్స్ కిందపడిపోయింది. పక్కన ఉన్న వరుడు ఆమెను చేతులు పట్టుకొని లేవదీయాల్సిందిపోయి.. ‘తెలివి తక్కువ దద్దమ్మ’ అంటూ తిట్టిపోశాడు. ఈ మాటలకు నొచ్చుకున్న పెళ్లి కూతురు తక్షణమే వరుడితో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుంది. పెళ్లిని రద్దు చేసుకుంటున్నానంటూ కోర్టుకు వెళ్లింది. విచారణ ముగిసిన తర్వాత కోర్టు సైతం విడాకులు మంజూరు చేసింది.
ఈ కేసు కువైట్ చరిత్రలోనే అతి స్వల్పకాల పెళ్లిగా పేర్కొంటున్నారు. వాస్తవానికి ఈ ఘటన 2019లో జరగ్గా.. తాజాగా మరోసారి వైరల్ అయ్యింది. తాను ఒక వివాహానికి పెళ్లి వేడుకకు వెళ్లానని.. అక్కడ పెళ్లికూతురుని వరుడు ఎగతాళి చేస్తూ ఉండిపోయాడని.. ఆమె కూడా ఆ మహిళలా విడాకులు ఇచ్చి ఉండాల్సిందంటూ ఓ వ్యక్తి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. దాంతో విడాకులు విషయం మరోసారి వైరల్ అయింది. గౌరవం లేకపోవడం పెళ్లిలో తొలి వైఫల్యమని సదురు వ్యక్తి పేర్కొన్నాడు. పెళ్లి మొదట్లోనే ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తులను వదిలివేయడం మంచిదని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. 2004లో యూకేలో ఒక జంట మాత్రం పెళ్లయిన 90 నిమిషాల తర్వాత విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించింది. రిజిస్టర్ ఆఫీస్‌లో స్కాట్ మెక్కీ, విక్టోరియా ఆండర్సన్ పెళ్లి చేసుకున్నారు. తోటి పెళ్లికూతుళ్లను ఇబ్బంది పెట్టినందుకు పెళ్లి కొడుకుపై వధువు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణ విడాకులకు దారి తీసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

