Road rage incident | రోడ్డుపై బైకులతో ఆకతాయిల హల్చల్.. సాటి వాహనదారులపై దౌర్జన్యం.. Video
Road rage incident | కర్ణాటక రాజధాని బెంగళూరులోని రహదారులపై ట్రాఫిక్ రద్దీతోపాటు అవారాల ఆగడాలు కూడా పెరిగిపోతున్నాయి. నగరంలో ఇటీవల కొత్తగా నిర్మించిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌పై అలాంటి మరో దౌర్జన్య ఘటన చోటుచేసుకుంది.
Road rage incident : కర్ణాటక రాజధాని బెంగళూరులోని రహదారులపై ట్రాఫిక్ రద్దీతోపాటు అవారాల ఆగడాలు కూడా పెరిగిపోతున్నాయి. నగరంలో ఇటీవల కొత్తగా నిర్మించిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌పై అలాంటి మరో దౌర్జన్య ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు యువకులు రెండు బైకులపై వెళ్తూ.. సాటి వాహనదారులను భయబ్రాంతులకు గురిచేశారు.
ఫ్లైఓవర్‌పై ఓ కారును వెంబడిస్తూ, కాలితో తంతూ, ఆ కారు డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ హల్చల్ చేశారు. ఇష్టారీతిన బైకులను నడుపుతూ ప్రమాదకర స్టంట్స్ వేశారు. యువకులతో ఆరాచకం చూసి భయంతో పలువురు వాహనదారులు తమ వాహనాల వేగం తగ్గించుకున్నారు. అయితే కారును వెంబడిస్తూ యువకులు చేసిన దౌర్జన్యాన్ని వెనుక మరో కారులో వస్తున్న ప్రయాణికులు మొబైల్లో రికార్డు చేశారు.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతోంది. యువకుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీమళ్లీ జరగకుండా ఉండాలంటే ఆ ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇలాంటి వారికి భారీ జరిమానాలు విధించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కింది వీడియోలో ఆకతాయిల వీరంగాన్ని మీరు కూడా వీక్షించవచ్చు.
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ನಿಲ್ಲದ ಪುಂಡರ ವ್ಹೀಲಿಂಗ್ ಹಾವಳಿ..!@BlrCityPolice @blrcitytraffic @CPBlr pic.twitter.com/0y2atyuNKe
— Aditya Samarth (@aaditya_samarth) July 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

