Nayattu OTT | ఆహాలోకి వస్తున్న మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్
Chunduru Police Station | టాలీవుడ్లో ప్రస్తుతం మలయాళ సినిమాల హవా నడుస్తుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది వచ్చిన ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం తెలుగులో మంచి కలెక్షన్లు సాధించాయి. చిన్న కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాలు కేవలం మలయాళ ప్రేక్షకులనే కాదు..అందర్నీ మెప్పిస్తున్నాయి.
Chunduru Police Station | టాలీవుడ్లో ప్రస్తుతం మలయాళ సినిమాల హవా నడుస్తుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది వచ్చిన ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం తెలుగులో మంచి కలెక్షన్లు సాధించాయి. చిన్న కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాలు కేవలం మలయాళ ప్రేక్షకులనే కాదు..అందర్నీ మెప్పిస్తున్నాయి. అందుకే మనవాళ్లు మలయాళ సినిమాలను రీమేక్ చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మలయాళంలో సూపర్ హిట్ అయిన మరో సినిమా తెలుగు ఓటీటీలోకి రాబోతుంది. కరోనా సెకండ్ వేవ్ టైంలో మలయాళంలో వచ్చిన చిత్రం నయట్టు (Nayattu).
2021లో కరోనా వలన థియేటర్లు మూసి ఉండడంతో ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలై మంచి హిట్ అందుకుంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాను తెలుగులో కోటా బొమ్మాళి(Kota Bommali) అంటూ రీమేక్ చేశారు. అయితే కోటా బొమ్మాళి ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఒరిజినల్ వెర్షన్ నయట్టును మళ్లీ తెలుగులోకి తీసుకువస్తుంది ఆహా(Aha). ఈ సినిమాను చుండూరు పోలీస్ స్టేషన్ (Chunduru Police Station) అనే పేరుతో తీసుకువస్తుంది. ఏప్రిల్ 26 నుంచి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది.
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. తాము చేయని హత్య కేసులో ముగ్గురు పోలీసు అధికారులు చిక్కుకుంటారు.ఈ కేసు నుంచి వాళ్లు బయటపడతారా? లేదా? చివరకు వాళ్ల జీవితం ఎలా మారింది? అనే కథాంశం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. కుంచాకో బోబన్, జోజు జార్జ్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మార్టిన్ ప్రక్కత్ దర్శకత్వం వహించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

