Aamir Khan | సితారే జమీన్ పర్ కోసం.. కెమెరా ముందుకు అమీర్‌ఖాన్
స్వీయ దర్శకత్వంలో అమీర్‌ఖాన్ నటించిన ‘తారే జమీన్ పర్' (2007) చిత్రం బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకొంది.
Aamir Khan | స్వీయ దర్శకత్వంలో అమీర్‌ఖాన్ నటించిన ‘తారే జమీన్ పర్’ (2007) చిత్రం బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకొంది. ప్రత్యేకమైన మానసిక సమస్యలతో బాధపడుతున్న పిల్లల పట్ల ప్రేమపూర్వక వైఖరి అనుసరిస్తూ వారిలోని ప్రతిభను వెలికితీయాలనే స్ఫూర్తివంతమైన కథాంశంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఇదే తరహా ఇతివృత్తంగా అమీర్‌ఖాన్ తాజాగా ‘సితారే జమీన్ పర్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. వచ్చే నెలలో ఢిల్లీలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.
అమీర్‌ఖాన్‌తో పాటు పదకొండు మంది పిల్లలు ఈ సినిమాలో నటించబోతున్నారు. ‘పారా ఒలింపిక్స్ నేపథ్యంలో సాగే కథ ఇది. మానసిక, శారీరకంగా దౌర్భల్యంతో ఉన్న పిల్లలను ఉత్తమ శిక్షణ అందించి, వారిలో ధైర్యాన్ని ప్రోది చేసే మార్గదర్శి పాత్రలో అమీర్‌ఖాన్ కనిపిస్తాడు. ‘తారే జమీన్ పర్’ తరహాలోనే చిన్నారుల్లో స్ఫూర్తినింపే కథాంశమిది’ అని చిత్ర బృందం పేర్కొంది. ‘ఈ సినిమా ప్రతి ఒక్కరిని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, హృదయాలను బరువెక్కిస్తుంది’ అని అమీర్‌ఖాన్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

