Vastu Shastra | వాస్తు అనేది నేలకు వర్తిస్తుందా? ఇంటికి వర్తిస్తుందా?
డబ్బులకు, సమస్యలకు సంబంధం లేదు. డబ్బులు (ధనం) లేనికాలం కంటే.. ధనం కలిగి ఉన్న సమయంలోనే అధిక సమస్యలు కలుగవచ్చు. ఇల్లు కొత్తదే కట్టుకోవచ్చు. అలాగని అది ఉన్నతమైనది, గొప్ప స్థలంలో కట్టినది అనుకోలేము. మనిషి సుఖానికి, శాంతికి చాలా తేడా ఉంది.
Vastu Shastra | మేము ఆర్థికంగా బాగానే ఉన్నాం. ఇల్లు కొత్తదే అయినా, సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటారు?
– బి. శారద, కోదాడ.
డబ్బులకు, సమస్యలకు సంబంధం లేదు. డబ్బులు (ధనం) లేనికాలం కంటే.. ధనం కలిగి ఉన్న సమయంలోనే అధిక సమస్యలు కలుగవచ్చు. ఇల్లు కొత్తదే కట్టుకోవచ్చు. అలాగని అది ఉన్నతమైనది, గొప్ప స్థలంలో కట్టినది అనుకోలేము. మనిషి సుఖానికి, శాంతికి చాలా తేడా ఉంది. సుఖం ఉంటే.. శాంతి ఉండాలని లేదు. సుఖం అనేది భౌతికమైనది. మంచి కుర్చీలో సుఖాసీనులు కావచ్చు. మంచి ఖరీదైన బెడ్ (పరుపు) కొని.. పడుకోవచ్చు. కానీ, కూర్చుంటే లేవలేని స్థితి ఉండవచ్చు. పడుకుంటే.. నిద్రపట్టని పరిస్థితి కలుగవచ్చు. ధనం సంపాదించినంత మాత్రాన శాంతి ఉంటుంది అనేది అబద్ధం. స్థల ప్రభావం; పవిత్రమైన, నిజాయతీ కలిగిన జీవన విధానం; సత్ప్రవర్తన కలిగిన స్నేహబంధం; అన్నికటికన్నా ముఖ్యంగా గతంలో తీసుకున్న గొప్ప నిర్ణయాలు; తద్వారా పొందే ఈశ్వరుని (ప్రకృతి) అనుగ్రహం.. ఇవిలేకుండా, ఖరీదైన ఇల్లు, పదవి.. వ్యక్తిని కాపాడలేవు. తగిన ఆహార నియమం ఉన్నప్పుడే.. వైద్యుని మందు రోగాన్ని పోగొడుతుంది కదా!?

హోమ్ థియేటర్లో టాయిలెట్ ఎటువైపు పెట్టుకోవచ్చు?
– బి. జ్ఞానేశ్వర్, మన్నెగూడ.
నిజానికి పూర్తిగా మూసి ఉండే చీకటిగదిలాంటి (హోమ్ థియేటర్) దానిలో టాయిలెట్ ప్లాన్ చేయకూడదు. దానికి ఫ్రీగా వెంటిలేషన్ అవకాశం ఉండదు. హైజినిక్ కాదు. సహజంగా హోమ్ థియేటర్ దీర్ఘచతురస్రంగా కడుతుంటారు. అలాగే పన్నెండు లేదా తొమ్మిది కుర్చీలతో, మెట్లుమెట్లుగా ఫ్లోరింగ్ చేసి, పూర్తి ఆధునిక టెక్నాలజీతో కట్టే ఆ హోమ్ థియేటర్‌కు ఆవలనే టాయిలెట్ ఏర్పాటుచేయాలి. అదే మంచి పద్ధతి. అలాకాదని, హోమ్ థియేటర్ నుంచి బయటి గదుల స్థలాన్ని కలుపుకొని ఏ మూలనో టాయిలెట్ కట్టినా.. ఆయా మూలలు పెరిగి దోషం అవుతుంది. కాబట్టి, అటు ఆరోగ్యపరంగా, ఇటు వాస్తుపరంగా మంచిదికాదు. అందుకే, టాయిలెట్‌ను హోమ్ థియేటర్ బయటే ప్లాన్ చేసుకోండి. శుభం!

నైరుతి భాగంలో ఇద్దరికీ ఒకే వెయిటింగ్ ఇచ్చి.. రెండు చాంబర్లు కట్టుకోవచ్చా? మాది ఆఫీసు స్థలం.
– బి. అవినాష్, నాచారం.
నైరుతి భాగంలో.. ఎప్పుడైనా ఒక చాంబరే (గది) వస్తుంది. ఎందుకంటే.. దక్షిణం కొంత, పశ్చిమం కొంత కలిగి ఉన్న మూల స్థానం నైరుతి కాబట్టి. కొలత ఎంత అనేది తరువాతి అంశం. ఒక గది నైరుతిలో వచ్చాక.. దానిని ఆనుకొని అటు ఉత్తరం కానీ, ఇటు తూర్పు కానీ వచ్చే మరో చాంబర్ నైరుతికాని గదే అవుతుంది. అంటే, ప్రాధాన్యతలో నైరుతి తర్వాత అది రెండో గది అవుతుంది. మీరు ఇద్దరు నైరుతిలో వేరువేరు చాంబర్లలో కాకుండా.. నైరుతి గదిలో కాస్త విశాలంగా కట్టుకొని ఒకే టేబుల్‌తో రెండు చైర్లు వేసుకుని వాడుకుంటే చాలా శ్రేష్ఠం. ఆలోచించండి. లేదా వేరువేరు గదులు కావాలంటే పక్కపక్కన రెండు చాంబర్లలో ఒకే వెయిటింగ్ వేసుకోండి. ప్రాధాన్యతను బట్టి కూర్చోండి.

వాస్తు అనేది నేలకు వర్తిస్తుందా? ఇంటికి వర్తిస్తుందా?
– ఎస్. రమణి, కొలనుపాక.
మంచిప్రశ్న. ‘వస – నివాసే’ అనే ధాతువునుంచి ‘వాస్తు’ శబ్దం పుట్టింది. నివాస యోగ్యత గల భూమిని ‘వాస్తువు’ అన్నారు. నిజానికి ఈ భూమే అతిపెద్ద వస్తువు. కానీ, యోగ్యతగల భూమి అనేది చాలా ప్రాధాన్యం సంతరించుకున్నది. తినే యోగ్యత కలిగినది ఆహారం. జీవించే యోగ్యత కలిగి ఉన్నది భూమి. దానిని సరిగ్గా ఎంచుకున్నప్పుడే మనిషి సగం గెలిచినట్టు. ఇక యోగ్యత కలిగిన గృహమేనా? అన్నది రెండో ప్రధాన అంశం. అనుగ్రహ ఫలంగా గొప్ప భూమి లభించవచ్చు. కానీ, అందులో వాస్తు యోగ్యత.. అంటే నివాస యోగ్యత కలిగిన గృహం నిర్మించారా? అన్నది పెద్ద ప్రశ్న. గృహాలన్నీ నివసించడం కోసమే కానీ, నివసించదగిన గృహాలు ఎన్ని అనేది ముఖ్యం. కాబట్టి.. వాస్తు అనేది అటు నేలకూ, ఇటు గృహానికీ వర్తిస్తుంది. మంచి వంటగాళ్లు (చెఫ్స్) పుచ్చు వంకాయలతో, వంటరాని వాళ్లు తాజా వంకాయలతో కూర వండారు. ఎలాంటి లాభం? ఇదీ అంతే!
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

