మలేరియా ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
నిర్మల్ జిల్లాలో మలేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి నయనారెడ్డి అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో గురువారం అధికారులు, వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ తీశారు.
- నిర్మల్ జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి నయనారెడ్డి
నిర్మల్ చైన్‌గేట్, ఏప్రిల్ 25 : నిర్మల్ జిల్లాలో మలేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి నయనారెడ్డి అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో గురువారం అధికారులు, వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ తీశారు. అనంతరం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో మలేరియా కేసులు నమోదు కాకుండా అందరూ అంకితభావంతో పని చేయాలన్నారు.
నిర్మల్ పక్కనే ఉన్న ఇతర జిల్లాలో మలేరియా కేసులు నమోదవుతున్న దృష్ట్యా మరింత అప్రమత్తతో విధులు నిర్వహిస్తూ దోమల నివారణ, నియంత్రణ, వ్యాధి లక్షణాల గూర్చి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణ అధికారి రవీందర్‌రెడ్డి, జిల్లా ఉప వైద్యాధికారి రాజేందర్, జిల్లా విస్తరణ, మీడియా అధికారి రవీందర్, సబ్ యూనిట్ అధికారులు కన్నయ్య, రాజు, వేణురావు, ఆరోగ్య పర్యవేక్షకులు భోజారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఆరోగ్య సహాయకులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కుంటాల, ఏప్రిల్ 25 : మండల కేంద్రంలో మలేరియా దినోత్సవంపై అవగాహన ర్యాలీ తీశారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, కుండీలో, టైర్లలో నీటి నిలువ ఉండకపోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల బెడదను నివారించుకోవాలని కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ శృతి రెడి ్డ సూచించారు. కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ సంతోషి రాణి, ఏఎన్ఎం సక్కుబాయి, హెల్త్ అసిస్టెంట్లు ప్రసాద్, కిషన్ ప్రసాద్, అంగన్వాడీ టీచర్లు, ఉన్నారు.
ఇచ్చోడ, ఏప్రిల్ 25 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో వైద్య సిబ్బంది మలేరియా వ్యాధి నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో డాక్టర్ సాగర్, వైద్య సిబ్బంది, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
శుభ్రత పాటిస్తేనే మలేరియా నిర్మూలన
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 25: గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా శుభ్రతను పాటిస్తేనే మలేరియా నిర్మూలన చేయడం సాధ్యమని డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ర్యాలీ తీశారు. ప్రజలకు పారిశుధ్యంతో పాటు శుభ్రత, మలేరియా నిర్మూలనపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీహెచ్‌వో సందీప్, హెల్త్ సూపర్వైజర్ జాదవ్ శ్రీనివాస్, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
నార్నూర్, ఏప్రిల్ 25: నార్నూర్ మండలం ఖంపూర్, గాదిగూడ మండలం పీహెచ్సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి పవార్ రవీందర్, ఆరోగ్య పర్యవేక్షకుడు చౌహాన్ చరణ్‌దాస్, వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి కాశీంరామ్ పాల్గొన్నారు.
దస్తురాబాద్, ఏప్రిల్ 25 : మండల కేంద్రంలో ప్రాథమి ఆరోగ్య కేంద్రంలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే డాక్టర్ సన్నీత్, హెచ్‌ఈవో వేణు గోపాల్, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
మలేరియా కేసులు లేవు
ఎదులాపురం, ఏప్రిల్ 25 : ఆదిలాబాద్ జిల్లాలో మలేరియా కేసులు లేవని, నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ విజృంభించే అవకాశం ఉందని ఇందుకు వారంలో రెండు రోజులు పాటు డ్రైడే నిర్వహించాలని డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా సమ సమాజం దిశగా మలేరియా రహిత ప్రపంచ నిర్మాణం అంశంపై గురువారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్యాధికారులు, ఆశ కార్యకర్తలు, సీవోలు, ఏఎన్ఎంలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలో మలేరియా కేసులు నమోదు కావడం లేదని ఇందుకు వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ర్యాపిడ్ ఫీవర్ సర్వే, ప్రజలకు అవగాహన కల్పిచడంతోనే సాధ్యమైందన్నారు.
2030 నాటికి దేశంలోనే మలేరియా నిర్మూలించడానికి ఎన్వీబీడీసీపీ పని చేస్తుందన్నారు. మలేరియా ప్రభావిత మండలాలు గాదిగూడ, నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండలో ప్రత్యేక శ్రద్ధతో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, జిల్లా మలేరియా అధికారి మెట్పెల్లివార్ శ్రీధ ర్, మెడికల్ ఆఫీసర్లు అవిషన్, సాయి, డీపీఎం అనిల్, ఎస్వో బ్రహ్మానందరెడ్డి , సబ్ యూనిట్ ఆఫీసర్ రఘునాథ్, కన్సల్టెంట్ షాబానాజ్, మలేరియా సూపర్వైజర్ అనిల్ పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రంలో..
కుభీర్, ఏప్రిల్ 25 : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కుంటే దోమలు వ్యాప్తి చెందవని దోమల వ్యాప్తికి పరిసరాల అపరిశుభ్రతే కారణమని అంగన్వాడీ టీచర్ గోరేకర్ సత్యశీల తెలిపారు. గురువారం కుబీర్‌లోని ఎస్సీ కాలనీ అంగ న్వాడీ కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

