South Korea | బిడ్డను కంటే 61 లక్షలు.. దక్షిణ కొరియా ప్రభుత్వం యోచన..!
South Korea | దక్షిణ కొరియాలో జనాభా సంక్షోభం నెలకొన్నది. ఈ నేపథ్యంలో దేశంలో జనన రేటును పెంచేందుకు ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రతి బిడ్డకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా 59 వేల పౌండ్లు(దాదాపు రూ.61 లక్షలు) నగదు ఇచ్చే విషయాన్ని సర్కార్ పరిశీలిస్తున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
- దేశంలో పడిపోయిన జననాల రేటు
సియోల్, ఏప్రిల్ 23: దక్షిణ కొరియాలో జనాభా సంక్షోభం నెలకొన్నది. ఈ నేపథ్యంలో దేశంలో జనన రేటును పెంచేందుకు ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రతి బిడ్డకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా 59 వేల పౌండ్లు(దాదాపు రూ.61 లక్షలు) నగదు ఇచ్చే విషయాన్ని సర్కార్ పరిశీలిస్తున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమాన్ని అమలు చేసే ముందు ఒక పబ్లిక్ సర్వేను నిర్వహిస్తున్నది. దక్షిణ కొరియాలో జననాల రేటు భారీగా పడిపోయింది.
2023లో ఇది 0.72కు తగ్గింది. అంటే దేశంలోని ప్రతి మహిళ ఒక్క బిడ్డకు కూడా జన్మనివ్వట్లేదు అన్నమాట. 2023లో నమోదైన జాతీయ జనన రేటు దేశ చరిత్రలోనే అత్యంత కనిష్ఠం. దేశంలో జనాభా సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయి. పెరిగిన జీవన వ్యయం, తగ్గిన జీవన నాణ్యత.. వెరసి దంపతులు వివాహ బంధానికి, పిల్లలను కనేందుకు విముఖత చూపుతున్నారు. జనన రేటును పెంచేందుకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

