Harish Rao | రేపు గన్‌పార్క్ వద్దకు నా రాజీనామా లేఖతో వస్తా.. నువ్వు వస్తావా..? రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్
Harish Rao | సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలన్నా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీశ్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరకి నా రాజీనామా లేఖతో వస్తా..నువ్వు వస్తావా? అని హరీశ్‌రావు మరోసారి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
Harish Rao | మెదక్ : సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలన్నా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీశ్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరకి నా రాజీనామా లేఖతో వస్తా..నువ్వు వస్తావా? అని హరీశ్‌రావు మరోసారి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో నిర్వహించిన ర్యాలీలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి చాలెంజ్ వేస్తున్నా.. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా లేఖతో వస్తున్నా.. నువ్వు వస్తవా..? రా దమ్ముంటే అని హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానన్నది నిజమైతే, బాండ్ పేపర్ మీద రాసిచ్చిన గ్యారెంటీలు అమలు చేసే మాట నిజమైతే.. గన్ పార్క్ వద్దకు రా. రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడుదాం. ఆగస్టు 15 లోగా రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే నా రాజీనామా లేఖను తీసుకెళ్లి స్పీకర్‌కు ఇస్తారు. ఒక వేళ అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ గవర్నర్‌కు ఇస్తారు. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతున్నా. దమ్ముంటే రా. మాట మీద నిలబడే వ్యక్తివి అయితేరా.. నువ్వు రాకపోతే తోక ముడిచినట్టే అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు. ఇక్కడి ఎమ్మెల్యే గురించి మీకు బాగా అర్థమైతన్నట్టుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. కాంగ్రెస్ నాయకులకు అహంకారం నెత్తికెక్కింది.. గాల్లో మాట్లాడుతున్నారు. వారిని భూమి మీదకు తేవాలంటే వెంకట్రామిరెడ్డిని పార్లమెంట్‌కు పంపాలి. అప్పుడే వారికి సోయి వస్తుంది అని హరీశ్‌రావు తెలిపారు.
హరీష్ రావును రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండు అన్నా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు
రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరకి నా రాజీనామా లేఖతో వస్తా..నువ్వు వస్తావా?
మన ఇద్దరి రాజీనామా లేఖలను మేధావులకు ఇద్దాం.. ఆగస్టు 15 లోగా మీరు… pic.twitter.com/tXGr50tfld
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

