న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: హైదరాబాద్‌కు చెందిన దివీస్ ల్యాబ్ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రూ.700 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నది. కస్టమర్ల అవసరాల మేరకు మరో ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌కు సమీపంలోని ప్లాంట్‌తోపాటు వైజాగ్‌లో ఉత్పత్తి కేంద్రాలు ఉండగా..వీటితోపాటు కాకినాడ వద్ద యూనిట్‌ను నెలకొల్పడానికి ఇప్పటికే భూమిని కొనుగోలు చేసింది.
దీర్ఘకాలికంగా కస్టమర్లతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థ..అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలను వేగవంతం చేసింది. దీంట్లో భాగంగా కొత్తగా రూ.650 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ నిధులను అంతర్గత వనరుల ద్వారా సేకరించనున్నట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. కాకినాడ ప్లాంట్ జనవరి 2027 నాటికి అందుబాటులోకి రావచ్చునని వెల్లడించింది.