New Visa Rules | యూరప్ దేశాలకు వెళ్లే భారతీయులకు శుభవార్త.. వీసా రూల్స్ సరళతరం..!
New Visa Rules | ఇకపై యూరప్ దేశాల్లో పర్యటించే భారతీయులకు యూరోపియన్ యూనియన్ (EU) శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఈయూ నూతన వీసా విధానాన్ని ప్రకటించింది. షార్ట్ స్టే వీసా అయిన షెంగెన్ వీసా (Schengen Visa) తో ఐరోపా దేశాలకు వెళ్లే ఇండియన్స్ ఇదివరకు ఆ వీసా కోసం మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయాల్సి వచ్చేది. నూతన విధానం ప్రకారం ఇకపై ఆ అవసరం ఉండదు.
New Visa Rules : ఇకపై యూరప్ దేశాలకు వెళ్లే భారతీయులకు యూరోపియన్ యూనియన్ (EU) శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఈయూ నూతన వీసా విధానాన్ని ప్రకటించింది. షార్ట్ స్టే వీసా అయిన షెంగెన్ వీసా (Schengen Visa) తో ఐరోపా దేశాలకు వెళ్లే ఇండియన్స్ ఇదివరకు ఆ వీసా కోసం మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయాల్సి వచ్చేది. నూతన విధానం ప్రకారం ఇకపై ఆ అవసరం ఉండదు.
షార్ట్ స్టే షెంగెన్ వీసాకు బదులుగా ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యేలా మల్టిపుల్ ఎంట్రీ షెంగెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈయూ భారతీయులకు కల్పించింది. ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీని బట్టి వీసాలపై వ్యాలిడిటీ ఉంటుంది. ఐరోపా సమాఖ్య ఏప్రిల్ 18న భారతీయ పౌరులకు మల్టిపుల్ ఎంట్రీ వీసాల జారీపై నిర్దిష్ట నిబంధనలను ఆమోదించింది.
ఇది ప్రస్తుత వీసా ప్రామాణిక నిబంధనల కంటే చాలా సులభతరంగా ఉంటుంది. కొత్తగా వచ్చిన వీసా ‘క్యాస్కేడ్’ విధానం ప్రకారం.. భారతీయ పౌరులకు ఇప్పుడు దీర్ఘకాలిక, బహుళ-ప్రవేశాల కోసం షెంగెన్ వీసాలను జారీ చేయనున్నారు. ఇందుకు అర్హత సాధించాలంటే గత మూడేళ్లలో కచ్చితంగా రెండుసార్లు వీసా ఆమోదం పొంది ఉండాలి. చట్టబద్ధంగా ఆ వీసాను వాడుకుంటే తర్వాత రెండేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

