ICICI | అడ్రస్ మారిన 17వేల క్రెడిట్ కార్డులు.. ఒకరికి బదులు మరొకరి వెళ్లాయంటున్న ఐసీఐసీఐ
ఇటీవల జారీ చేసిన దాదాపు 17,000 కొత్త క్రెడిట్ కార్డులు వివిధ డిజిటల్ పద్ధతుల్లో పొరపాటున ఒకరికి బదులు మరొకరి చేతికి వెళ్లాయని ఐసీఐసీఐ బ్యాంక్ గురువారం ప్రకటించింది. అయినప్పటికీ ఈ తప్పు వల్ల ఎటువంటి దుర్వినియోగం జరుగలేదన్న బ్యాంక్..
ICICI | న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఇటీవల జారీ చేసిన దాదాపు 17,000 కొత్త క్రెడిట్ కార్డులు వివిధ డిజిటల్ పద్ధతుల్లో పొరపాటున ఒకరికి బదులు మరొకరి చేతికి వెళ్లాయని ఐసీఐసీఐ బ్యాంక్ గురువారం ప్రకటించింది. అయినప్పటికీ ఈ తప్పు వల్ల ఎటువంటి దుర్వినియోగం జరుగలేదన్న బ్యాంక్.. ఒకవేళ ఏదైనా ఆర్థిక నష్టం జరిగితే బాధిత కస్టమర్లకు దాన్ని పరిహారంగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కాగా, కొత్త క్రెడిట్ కార్డులను వాడాలంటే కస్టమర్ల మొబైల్స్‌కు వచ్చే వన్-టైమ్ పాస్వర్డ్లు కీలకమని, కావున కార్డుల దుర్వినియోగం జరగడానికి చాలాచాలా తక్కువ వీలుందని నిపుణులు చెప్తున్నారు.
మరోవైపు ఈ కార్డులన్నింటినీ ఇప్పటికే బ్లాక్ చేశామంటున్న ఐసీఐసీఐ బ్యాంక్.. తప్పుగా పంపిణీ అయిన కార్డులను తిరిగి వెనక్కి తీసుకోవడం వీలు కానందున, అసలు కస్టమర్లకు త్వరలోనే కొత్త కార్డులు వస్తాయన్నది. అయితే బుధవారం సాయం త్రం నుంచే ఈ వ్యవహారం.. పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, దాన్నిప్పుడు బ్యాంక్ ధ్రువీకరించడం గమనార్హం. మరోవైపు ఈ తరహా నిర్లక్ష్యం మూలంగానే కొటక్ బ్యాంక్‌పై ఆర్బీఐ కొరడా ఝుళిపించిన నేపథ్యంలో ఇప్పుడు ఐసీఐసీఐ హాట్ టాపికైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

