US Universities | పాలస్తీనా అనుకూల నిరసనలతో అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
US Universities | పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు (US Universities) అట్టుడుకుతున్నాయి.
US Universities | పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు (US Universities) అట్టుడుకుతున్నాయి. గాజా పోరులో (Gaza Protests) ఇజ్రాయెల్‌కు మద్దతుగా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు ఆందోళనలకు దిగారు.
గత కొన్ని రోజులుగా తరగతి గదులను బహిష్కరించి పాలస్తీనాలకు అనుకూలంగా నిరసనలు చేపడుతున్నారు (pro-Palestinian protests). దీంతో సామూహిక అరెస్టులు, తరగతుల బహిష్కరణ (shut down classes)తో వర్సిటీలు అట్టుడుకుతున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం వల్ల గాజాలో తలెత్తిన మానవ సంక్షోభ పరిస్థితులపై విద్యార్థులు మండిపడుతున్నారు. పాలస్తీనా మహిళలు, చిన్నారుల మరణాలకు బైడెన్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థుల నిరసనలతో యేల్, ఎంఐటీ, హార్వర్డ్, కొలంబియా తదితర విశ్వవిద్యాలయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొలంబియా వర్సిటీ తరగతి గదులను కూడా మూసివేసింది. మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ నిరసనలపై ఇజ్రాయెల్ అనుకూల మద్దతుదారులు, ఇతర విద్యార్థులు క్యాంపస్ లలో తమ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని క్యాంపసులు దాడులు, బెదిరింపులు, విద్వేషపూరిత ప్రసంగాలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
మరోవైపు క్యాంపస్‌లో విద్యార్థుల నిరసనలపై కొలంబియా వర్సిటీ అధికారులు స్పందించారు . విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని, కానీ ఇతర విద్యార్థులను వేధించేందుకు, భయపెట్టేందుకు, క్యాంపస్‌లో ఇబ్బందులు సృష్టించేందుకు వీల్లేదని తెలిపారు. యూదు విద్యార్థుల భయాందోళనలపై తాము తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వర్సిటీ అధికారులు నిరసనకారులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
Also Read..
US Senate: ఉక్రెయిన్, ఇజ్రాయిల్‌కు 95 బిలియన్ల డాలర్ల ప్యాకేజీ.. బిల్లుకు అమెరికా సేనేట్ ఆమోదం
South Korea | బిడ్డను కంటే 61 లక్షలు.. దక్షిణ కొరియా ప్రభుత్వం యోచన..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

