బీజింగ్, ఏప్రిల్ 23: భవిష్యత్తులో యూరిన్ టెస్టు కోసం ల్యాబ్‌కు వెళ్లి శాంపిల్ ఇవ్వాల్సిన అవసరం పడదేమో! టాయిలెట్లో మూత్రవిసర్జన చేయగానే మీ ఆరోగ్యం ఎలా ఉందో పూర్తి రిపోర్ట్ ఇచ్చే అత్యాధునిక టాయిలెట్లు అందుబాటులోకి వచ్చాయి.
చైనాలోని బీజింగ్, షాంఘైలో పలు పురుషుల మూత్రశాలల్లో ఓ ప్రైవేటు కంపెనీ ఈ హైటెక్ టాయిలెట్లు అమర్చింది. షాంఘైకు చెందిన క్రిస్టియన్ పీటర్సన్-క్లౌసెన్ అనే డైరెక్టర్ ‘ఎక్స్’లో ఈ టాయిలెట్లకు సంబంధించిన ఒక పోస్ట్ చేశారు.