అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu ) కి రాబోయే ఎన్నికలు చివరి ఎన్నికలని గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కొడాలి నాని (Kodali Nani) ఆరోపించారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోకపోగా వాటిని నిలుపుదల చేయిస్తూ అడ్డుకుంటున్న బాబుకు మాడు పగిలేలా ప్రజలు తీర్పును ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. ఏపీలో ప్రజలను కించపరిచేలా మాట్లాడుతూ ఇతర దేశాల్లో ఉన్న వారిని పొగడ్తలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఓటర్ల (Voters) కు డబ్బులను ఎగజల్లుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు . గుడివాడలో మరోసారి వైసీపీ జెండాను ఎగురవేస్తామని ధీమాను వ్యక్తం చేశారు. టీడీపీ (TDP) నాయకులు వైసీపీ నాయకులను రెచ్గగొట్టేలా ప్రయత్నిస్తున్నారని, తామంతా సంయమనంతో సీఎం జగన్ ఆధ్వర్యంలో ఎన్నికలకు మేమంతా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల్లో చంద్రబాబు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ఇవ్వలేదని విమర్శించారు.