పాల్వంచ రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సత్యనారాయణ పురం(మొండికట్ట) సర్పంచ్ జర్పుల సంధ్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. సోమవారం ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఇటీవల పంచాయితీ పనుల్లో ఆమె భర్త జోక్యాన్ని తగ్గించుకోవాలని పంచాయితీ కార్యదర్శి సర్పంచ్ సంధ్య దృష్టికి తీసుకువెళ్లారు.
పంచాయితీ కార్యదర్శి అలా చెప్పడంతో మనస్తాపానికి గురైన సంధ్య.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్పంచ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. పంచాయతీ కార్యదర్శిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఎంపీడీఓ నారాయణ తెలిపారు.