రాయపోల్ ఫిబ్రవరి 23. తాను ఓనమాలు నేర్చుకున్న పాఠశాలకు ఎంతో కొంత సాయపడాలని అనుకుంటారు పూర్వ విద్యార్థులు. సొంత డబ్బుతో వసుతుల కల్పనలో భాగమవుతుంటారు. రాయపోల్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి మామిడి బాల్ రెడ్డి సైతం ఇదే కోవకు చెందుతారు. ఎం.బీ.ఆర్ గ్రూప్ చైర్మన్ అయిన ఆయన.. రూ.30 వేలతో పాఠశాలలో వాటర్ ఫిల్టర్ కూల్ ఏర్పాటు చేయించారు. సోమవారం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ ట్యాంక్లను ఆయన ప్రారంభించారు.
ఉన్నత పాఠశాలలో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు అనంతరం మామిడి బాల్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని చెప్పారు. ఇకముందు కూడా విద్యార్థుల ఉన్నత చదువులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించిన ఆయన.. వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ చల్లని, నార్మల్ వాటర్ లభించేలా వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేశానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటు కోసం తాను కృషి చేయడంతో పాటు పూర్వ విద్యార్థుల సహకారం తీసుకుంటున్నానని బాల్ రెడ్డి తెలిపారు. 1977 బ్యాచ్ పూర్వ విద్యార్థులందరు కలిసి ఉన్నత పాఠశాలకు మరింత సేవా కార్యక్రమాలు అందిస్తామని ఆయన వెల్లడించారు.
గురువులను గౌరవించి.. వారు చూపిన బాటలో నడిచి, కష్టపడి చదివిఇంతటి స్థాయికి వచ్చామని బాల్ రెడ్డి విద్యార్థులకు తెలిపారు. అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీ పెరిగిపోయిందని.. నేటి విద్యార్థులు టెక్నాలజీని మంచికి వినియోగించి. గురువులను గౌరవించి చదువులో రాణించి రాయపోల్ ఉన్నత పాఠశాలను జిల్లాలోని కాకుండా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాలకు ప్రధాన గేటు పైన బోర్డు ఏర్పాటు చేస్తామని ఆయన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు హామీ ఇచ్చారు. తాము చదువుకున్న పాఠశాలకు ఏదో రకంగా సేవ చేసే భాగ్యం భగవంతుడు చూపించాడని. తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని బాల్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం కొత్తపల్లి నరేందర్ రెడ్డితో కలిసి ఆయన విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు నాగరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.