WI vs ZIM : సూపర్ 8 తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు చెలరేగిపోయారు. సంచలన ఆటతో నాకౌట్‌కు దూసుకొచ్చిన జింబాబ్వేను వణికిస్తూ.. షిమ్రన్ హిట్మైర్(85) ఊచకోతకు తెగబడ్డాడు. అరేబియా సముద్రపు సమీపలోని వాంఖడే మైదానంలో తుఫాన్‌లా చెలరేగాడు. రోవ్‌మన్ పావెల్(59) జతగా జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరి దూకుడుతో విండీస్ స్కోర్‌బోర్డు పరుగులు తీసింది. వీరిద్దరూ ఔటయ్యాక.. షెర్ఫానే రూథర్‌ఫోర్డ్(31 నాటౌట్), రొమారియో షెపర్డ్(21)లు తమ స్టయిల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఫలితంగా ఈ సీజన్లోఅత్యధిక పరుగుల(254) రికార్డు స్కోర్‌తో విండీస్ చరిత్ర లిఖించింది.
పవర్ హిటర్టతో నిండిన వెస్టిండీస్ జట్టు నాకౌట్ తొలిపోరులోనే గర్జించింది. చూస్తున్నది హైలెట్సా అన్నట్టుగా షిమ్రన్ హిట్మైర్(85), రొవ్మన్ పావెల్(59)లు విధ్వంసక బ్యాటింగ్‌తో జింబాబ్వే బౌలర్ల భరతం పట్టారు. తొలి రెండు ఓవర్లో 7 రన్స్ మాత్రమే వచ్చినా.. ఆ తర్వాత విండీస్ పుంజుకుంది. వచ్చినవాళ్లు వచ్చినట్టు.. చివరి ఓవర్ వరకూ బౌండరీల మోత కొనసాగించగా.. ఈ సీజన్లో ఒమన్‌పై ఐర్లాండ్ 235 పరుగులతో నెలకొల్పిన రికార్డును విండీస్ బ్రేక్ చేసింది.
West Indies slam the second-highest total in #T20WorldCup history 💥 pic.twitter.com/22FyWtX8uh
— ESPNcricinfo (@ESPNcricinfo) February 23, 2026
ఓపెనర్ బ్రాండన్ కింగ్(9)ను నగవర ఔట్ చేసి షాకిచ్చినా.. షిమ్రన్ హిట్మైర్ జతగా దూకుడు పెంచాడు షాయ్ హోప్(14). నగవర వేసిన ఐదో ఓవర్లో హెట్మై ర్ హ్యాట్రిక్ ఫోర్లు బాదగా.. హోప్ ఒక ఫోర్ సాధించాడు. ఎవాన్స్ ఓవర్లోనూ ఫోర్ రాబట్టిన విండీస్ సారథి.. మరో షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద బెన్నెట్ డైవింగ్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. ఫలితంగా 54కే రెండు బిగ్ కోల్పోయింది విండీస్. రజా వర్లో మూడు సిక్సర్లు బాది 19 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. మెగా టోర్నీలో విండీస్ తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీ హెట్మైర్దే. 10వ ఓవర్లోనే స్కోర్ వంద దాటింది.
Unbelievable hitting by West Indies at the Wankhede – their highest total at the #T20WorldCup! 🙌 pic.twitter.com/3S949iurMp
— ESPNcricinfo (@ESPNcricinfo) February 23, 2026
ఎడాపెడా బౌండరీలతో 51 బంతుల్లోనే 122 రన్స్ పిండుకున్న హెట్‌మైర్, పావెల్ ద్వయాన్ని ఎట్టకేలకు క్రెమర్ విడదీసి ఊరటనిచ్చాడు. కాసేపటికే అర్ధ శతకం పూర్తిచేసుకున్న పావెల్‌ను ముజరబని వెనక్కి పంపాడు. అయినా సరే విండీస్ బ్యాటర్ల జోరు తగ్గలేదు. షెర్ఫానే రూథర్‌ఫోర్డ్(31 నాటౌట్), రొమారియో షెపర్డ్(21)లు విరుచుకుపడడంతో.. విండీస్ స్కోర్ 17వ ఓవర్లోనే 200 దాటింది. ఆఖరి ఓవర్లో జేసన్ హోల్డర్(13) రెండు సిక్సర్లతో ఈ సీజన్లో ఐర్లాండ్ రికార్డును బ్రేక్ చేస్తూ 254 పరుగులతో రికార్డు నెలకొల్పింది కరీబియన్ జట్టు.