Health Tips | ఇలా చేస్తే వయసుతోపాటు వచ్చే సమస్యలు మీ దరిచేరవు!
వయసుతోపాటే వచ్చే చిన్నచిన్న సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అందుకే పెరుగుతున్న వయసుతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేందుకు వెచ్చించే సమయాన్ని కూడా పెంచుకోక తప్పదు.
Health Tips | వయసుతోపాటే వచ్చే చిన్నచిన్న సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అందుకే పెరుగుతున్న వయసుతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేందుకు వెచ్చించే సమయాన్ని కూడా పెంచుకోక తప్పదు. వ్యాయామంతోపాటు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వయసు కారణంగా వచ్చే వివిధ సమస్యలు దరిచేరవు.
ఆరోగ్యం కోసం, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి చాలామంది వ్యాయామాన్ని ఆశ్రయిస్తారు. అదే సమయంలో తగిన విశ్రాంతి తీసుకోరు. అలసిన శరీరం బడలిక తీరకపోతే ఆరోగ్యం వేగంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల రోజంతా నిస్సత్తువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి కూడా క్రమంగా తగ్గుతుంది. అందుకే వ్యాయామంతోపాటు వీలైనంత మేరకు విశ్రాంతికి కూడా ప్రాధాన్యమివ్వాలి.
- డూ వర్కవుట్
40 ఏండ్లు దాటాక స్త్రీలకు రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటినుంచి బయటపడేందుకు గూగుల్ గురు ప్రవచించిన వ్యాయామాలు చేస్తుంటారు. ఇందులో ఎక్కువ భాగం గుండె ఆరోగ్యానికి సంబంధించిన ఎక్సర్సైజులే ఉంటాయి. అయితే అలాకాకుండా కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలపై కాస్త శ్రద్ధ పెంచుకోవాలి. లేకుంటే ఎముకలు క్రమంగా బలహీనమై అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. నిపుణుల పర్యవేక్షణలో సరైన వర్కవుట్లు చేయడం అవసరం.
- యోగా, ధ్యానం
వర్కవుట్ల వల్ల కండరాలు బలపడతాయి. అదే సమయంలో శరీరం ఫ్లెక్సిబిలిటీ కోల్పోతుంది. యోగా, ధ్యానంతో ఎప్పట్లా ఫ్లెక్సిబుల్‌గా ఉంచుకోవచ్చు.
-
పోషకాహారం
ఎన్ని చేసినా.. సరైన పోషకాహారం తీసుకోకపోతే ఆశించిన ప్రయోజనం ఉండదు. డైట్ చార్ట్‌లో సంతులిత ఆహారం లేకపోతే అది తీవ్ర సమస్యలకు దారి తీయొచ్చు. క్రాష్ డైట్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ప్రొటీన్లు, విటమిన్లు తీసుకోవడంపై శ్రద్ధ పెట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

