పెద్దపల్లి : పెద్దపల్లి(Peddapally) జిల్లా బీజీపీ(BJP) పార్టీలో ఆదిపత్య పోరు కొనసాగతున్నది. ఎన్నికల నామినేషన్ సందర్భంగా తమ నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీజేపీ నేతలు బహాబాహీకి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వద్ద జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల వర్గీయులు అడ్డుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పేరు, కాసిపేట లింగయ్య పేర్లు చెప్పకుండానే ప్రదర్శన ప్రారంభించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. తమ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆగ్రహించిన గుజ్జుల వర్గీయులు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో సునీల్ రెడ్డి రామకృష్ణారెడ్డి, కాసిపేట లింగయ్య పేర్లు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.