bSafe App | నగరం, గ్రామం ఎక్కడైనా మహిళలు ఒంటరిగా ప్రయాణించాలంటే భయపడుతున్నారు. నిర్మానుష్య ప్రదేశాల్లో, చీకటి పడిన తర్వాత మహిళలు ఒంటరిగా ప్రయాణించడం అంత సేఫ్ కాదు. సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలు వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళల భద్రతకు భరోసా ఇస్తున్నది బీ సేఫ్ యాప్. ఎవరినుంచైనా, ఎక్కడైనా లైంగిక వేధింపులు ఎదురైన సమయంలో మహిళలకు భద్రత కల్పించేందుకు బీ సేఫ్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా ఆ వ్యక్తి ఉన్న ప్రదేశం, సమయం సన్నిహితులకు తెలిసిపోతుంది. నెవర్ వాక్ ఎలోన్ అనే ట్యాగ్ లైన్‌తో బీ సేఫ్ యాప్ రూపొందించారు. ఈ యాప్ ద్వారా స్నేహితులు, కుటుంబం, సహోద్యోగులు, భాగస్వాములు సహా వ్యక్తిగత భద్రతా నెట్‌వర్క్‌ను రూపొందించుకునేందుకు అవకాశం ఉంది.
లైవ్ స్ట్రీమింగ్, ఆటోమేటిక్ ఆడియో, వాయిస్ అలారం యాక్టివేషన్, రియల్ టైమ్ యూజర్ మూవ్‌మెంట్‌ను ట్రాక్ చేయవచ్చు. అదే సమయంలో వీడియో రికార్డింగ్ సిస్టమ్ కూడా ఈ యాప్‌లో ఉంది. ఒక దారుణ సంఘటన తర్వాత చార్లెన్, ఆమె తండ్రి కలిసి బీ సేఫ్ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఏబీసీ, సీఎన్ఎన్, ఎన్ బీబీసీ, ఫాక్స్ న్యూస్, ఫోర్బ్స్ తదితర ప్రసార మాధ్యమాల్లోఈ యాప్‌పై కథనాలు వచ్చాయి. ఇప్పటికే మిలియన్ల మంది బీ సేఫ్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నారు.