Credit Cards | లావాదేవీల్లో క్రెడిట్ కార్డుల హవా..
క్రెడిట్ కార్డు ఆధారిత లావాదేవీలు రికార్డు స్థాయికి చేరాయి. గత నెలలో నిరుడుతో పోల్చితే 20 శాతం పుంజుకున్నాయి. అంతకుముందు నెల ఫిబ్రవరితో చూస్తే 10 శాతం పెరిగాయి. ఈ క్రమంలోనే ఆన్లైన్లో నెలవారీ క్రెడిట్ కార్డుల వినియోగం తొలిసారి లక్ష కోట్ల రూపాయల మార్కును దాటింది.
- లావాదేవీల్లో నయా రికార్డు
- మార్చిలో రూ.1.65 లక్షల కోట్లు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ కనిపిస్తున్న జోరు
Credit Cards | న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: క్రెడిట్ కార్డు ఆధారిత లావాదేవీలు రికార్డు స్థాయికి చేరాయి. గత నెలలో నిరుడుతో పోల్చితే 20 శాతం పుంజుకున్నాయి. అంతకుముందు నెల ఫిబ్రవరితో చూస్తే 10 శాతం పెరిగాయి. ఈ క్రమంలోనే ఆన్లైన్లో నెలవారీ క్రెడిట్ కార్డుల వినియోగం తొలిసారి లక్ష కోట్ల రూపాయల మార్కును దాటింది. ఈ ఏడాది మార్చిలో రూ.1,04,081 కోట్లుగా ఉన్నది మరి. ఫిబ్రవరిలో ఇది రూ.94,774 కోట్లుగా ఉంటే, గత ఏడాది మార్చిలో రూ.86,390 కోట్లుగానే ఉన్నది. ఇక ఆఫ్లైన్లోనూ క్రెడిట్ కార్డు లావాదేవీలు (పాయింట్ ఆఫ్ సేల్-పీవోఎస్) 20 శాతం ఎగిశాయి. గత నెల రూ.60,505 కోట్లుగా ఉన్నాయి. క్రిందటి ఏడాది మార్చిలో ఇవి రూ.50,920 కోట్లు. ఈ ఫిబ్రవరిలో రూ.54,431.48 కోట్లుగా ఉన్నాయి. దీంతో అటు ఆన్లైన్, ఇటు ఆఫ్లైన్లలో క్రెడిట్ కార్డు ద్వారా జరిగిన లావాదేవీల విలువ ఈ మార్చిలో ఏకంగా రూ.1,64,586 కోట్లుగా నమోదైంది. ఏడాది క్రిందట ఇదే నెలలో రూ.1,37,310 కోట్లే. ఈ ఫిబ్రవరిలో మాత్రం రూ.1,49,205 కోట్లుగా ఉన్నది.
హెచ్డీఎఫ్సీ టాప్
క్రెడిట్ కార్డ్ మార్కెట్లో దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టాప్‌లో ఉన్నది. ఈ మార్చి ఆఖరు నాటికి 20.2 శాతం వాటా దీనిదే. ఆ తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 18.6 శాతంతో రెండో స్థానంలో ఉన్నది. మూడో స్థానంలో ఐసీఐసీఐ బ్యాంక్ కొనసాగుతున్నది. ఇక నిరుడు మార్చితో పోల్చితే ఈ ఏడాది మార్చిలో క్రెడిట్ కార్డు వినియోగదారులూ పెరిగారు. దేశంలో క్రెడిట్ కార్డుల సంఖ్య 20 శాతం ఎగబాకి 10.1 కోట్లకు చేరింది. ఫిబ్రవరిలో మొదటిసారి 10 కోట్ల మార్కును దాటింది. నిరుడు మార్చిలో 8.5 కోట్ల క్రెడిట్ కార్డులే ఉండగా, ఏడాది కాలంలో దాదాపు 1.5 కోట్లకుపైగా పెరుగడం గమనార్హం. ఇక క్రెడిట్ కార్డ్ మార్కెట్లో 90 శాతం వాటా.. వాటిని పెద్ద ఎత్తున జారీ చేస్తున్న టాప్-10 బ్యాంకులదే.
- ఈ ఏడాది మార్చిలో క్రెడిట్ కార్డు ద్వారా జరిగిన లావాదేవీల్లో ఆఫ్‌లైన్ 18 కోట్లు, ఆన్లైన్ 16.4 కోట్లు. నిరుడుతో పోల్చితే 28 శాతం, 33 శాతం చొప్పున పెరిగాయి. చిన్నచిన్న లావాదేవీలకూ క్రెడిట్ కార్డులను వాడుతున్నవారు పెరగడమే ఇందుకు కారణం.
- గత నెల స్టోర్ల (ఆఫ్‌లైన్)లో 30 శాతం పడిపోయిన డెబిట్ కార్డు ఆధారిత లావాదేవీలు. 11.6 కోట్లకు పరిమితం. ఆన్‌లైన్‌లోనూ 41 శాతం దిగి 4.3 కోట్లకు తగ్గుదల. విలువ ప్రకారం చూస్తే వరుసగా రూ.29,309 కోట్లు, రూ.15,213 కోట్లుగా ఉన్నాయి. 17 శాతం మేర క్షీణించాయి.
- ఆర్బీఐ వివరాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2023-24) మొత్తంగా క్రెడిట్ కార్డుల ద్వారా దేశంలో జరిగిన లావాదేవీల విలువ రూ.18.3 లక్షల కోట్లుగా ఉన్నది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23) దాదాపు రూ.14 లక్షల కోట్లే.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

