అమరావతి : ఉద్యోగం వేటలో ఉన్న ముగ్గురు యువకుల కల నెరవేరకుండానే మృతి చెందడం వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఏపీలోని అన్నమయ్య(Annamaiah District) జిల్లా రామసముద్రం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఉద్యోగం కోసం రెండు రోజుల క్రితం బెంగళూరు (Bangalore) కు వెళ్లారు. గురువారం సాయంత్రం రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు కిందపడి ముగ్గురు దుర్మరణం చెందారు.
రైల్వే పోలీసులు (Police) ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటన వద్ద లభించిన పత్రాల ఆధారంగా మృతులు రామసముద్రం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.