Guy Whittall | హరారే: జింబాబ్వే మాజీ ఆల్‌రౌండర్ గై విట్టాల్ చిరుత దాడిలో తీవ్ర గాయాలపాలయ్యాడు. హ్యుమని ప్రాంతం లో తన పెంపుడు కుక్క (చికారా)తో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన అతడిపై ఓ చిరుత మెరుపు దాడి చేసింది.
అయితే అతడితో ఉన్న చికారా.. ప్రాణాలకు తెగించి చిరుతతో పోరాడి విట్టాల్‌ను రక్షించడమే గాక దానిని తరిమికొట్టింది. తీవ్రగాయాలపాలైన చికారాతో పాటు విట్టాల్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆయన భార్య ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.