Health Tips | పుట్టబోయే బిడ్డల రూపురేఖలకు.. తల్లి ఆహారపు అలవాట్లకు బలమైన లంకె..!
గర్భం ధరించగానే కాబోయే తల్లులు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, పుట్టబోయే బిడ్డల రూపురేఖలకు తల్లి ఆహారపు అలవాట్లకు బలమైన లంకె ఉంటుందని ఒక అధ్యయనం తెలిపింది. దీన్ని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ ప్రచురించింది.
Health Tips | గర్భం ధరించగానే కాబోయే తల్లులు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, పుట్టబోయే బిడ్డల రూపురేఖలకు తల్లి ఆహారపు అలవాట్లకు బలమైన లంకె ఉంటుందని ఒక అధ్యయనం తెలిపింది. దీన్ని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ ప్రచురించింది. గర్భంలో బిడ్డ శరీరం రూపుదిద్దుకునే దశలో తల్లి తీసుకునే ఆహారం గణనీయమైన ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. తల్లి ఆహారంలో ప్రొటీన్ స్థాయులకు జన్యువుల పనితీరుకు సంబంధం ఉంటుందని ఈ అధ్యయనంలో పరిశోధకులు కనుక్కొన్నారు. ముఖ్యంగా ఎంటీఓఆర్సీ1 జన్యువులతో ఈ లంకె ముడిపడి ఉంటుంది. పిండం, కపాలం, ముఖం (క్రేనియోఫేషియల్) ఆకారంపై ఈ జన్యువులు నేరుగా ప్రభావం చూపుతాయని పరిశోధకులు తెలిపారు.
తల్లుల ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటే బిడ్డల దవడలు బలంగా, పదునుగా ఉంటాయి. పెద్ద ముక్కులు ఏర్పడతాయి. అదే ప్రొటీన్లు తక్కువగా ఉంటే మాత్రం పలుచటి, కొనదేలిన లక్షణాలు ఉంటాయట. అంటే తల్లులు తీసుకునే ప్రొటీన్లు పిల్లల దవడలు, ముక్కు రూపం, పరిమాణాన్ని ప్రభావితం చేస్తాయన్నమాట. కాగా, తల్లులు తీసుకునే ఆహారం నవజాత శిశువుల ఆరోగ్యానికి సంబంధం ఉంటుందని ఇంతకుముందు అధ్యయనాల్లోనే వెల్లడైంది. ఉదాహరణకు… పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారమే తీసుకునే వేగన్ తల్లుల పిల్లలు పుట్టినప్పుడు తక్కువ బరువుతో ఉంటారు. ఇక ఊబకాయం ఉన్న తల్లులు జీవక్రియలకు సంబంధించిన ముప్పు ఉండే పిల్లలకు జన్మనిస్తారని మరో అధ్యయనం కనుక్కొంది. ఇలాంటి పిల్లలకు ముందుముందు ఫ్యాటీ లివర్ డిసీజ్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆ అధ్యయనం తెలిపింది. ఇలా ఉంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినే తల్లులు తమ కడుపులో ఉన్న పిండాలకు హానికరమైన రసాయనాలను అందిస్తారని మరో అధ్యయనం హెచ్చరించింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

