Realme Narzo 70 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నార్జో 70 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సిరీస్ ఫోన్లలో రియల్మీ నార్జో 70 5జీ, రియల్మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్లు ఉన్నాయి. రెండు ఫోన్లలోనూ 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటాయి. రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్మీ యూఐ 5.0 ఓఎస్ వర్షన్‌పై పని చేస్తాయి. రెండు ఫోన్లకూ ఐపీ54 రేటెడ్ రెసిస్టెన్స్ ఉంటది. రెండు కలర్ ఆప్షన్లు, రెండు ర్యామ్ స్టోరేజీ ఆప్షన్లలో లభిస్తాయి.
రియల్మీ నార్జో 70 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999లకు లభిస్తాయి. మరోవైపు రియల్మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,999లకు లభిస్తాయి. రెండు ఫోన్లూ ఫారెస్ట్ గ్రీన్, ఐస్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
రియల్మీ నార్జో 70 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్మీ యూఐ 5.0 స్కిన్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. మూడేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్, రెండేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 టచ్ శాంప్లింగ్ రేటుతో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2400 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే ఉంటది. 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5జీ ఎస్వోసీ చిప్ సెట్ విత్ ఆర్మ్ మాలీ జీ68 జీపీయూ ఉంటది. డైనమిక్ ర్యామ్ ఫీచర్ తో వస్తున్న ఈ ఫోన్ లో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటది. 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ కెపాసిటీ గల ఈ ఫోన్ లో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు.
రియల్మీ నార్జో 70 5జీ ఫోన్ 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటది. డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ విత్ హీ-రెస్ ఆడియో సర్టిఫికేషన్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ ఉంటాయి. రియల్మీ నార్జో 70 5జీ ఫోన్ 45వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ సింగిల్ చార్జింగ్ తో 518 గంటల పాటు స్టాండ్ బైగా ఉంటుంది. 61 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది.
రియల్మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 240 టచ్ శాంప్లింగ్ రేట్‌తోపాటు 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2400 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + ఎస్వోసీ విత్ ఆర్మ్ మాలి-జీ57 జీపీయూ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇది డైమనిక్ ర్యామ్ ఫీచర్ కు మద్దతుగా నిలుస్తుంది.
రియల్మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. వీటితోపాటు 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, బ్యాటరీ వార్నింగ్స్, చార్జింగ్ స్టేటస్ తెలిపేందుకు మినీ క్యాప్సూల్ 2.0 ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉండటంతోపాటు 128 జీబీ స్టోరేజీ కెపాసిటీని 2 టిగా బైట్స్ వరకూ విస్తరించుకోవచ్చు. 45వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటది.