ఇప్పుడు ఫ్యాషన్ దారి మారిపోయింది. కేవలం ముందుకు పరుగు తీయడమే కాదు, వెనకటి సంగతుల్ని కలబోసుకోవడమూ ముఖ్యమేనంటున్నది. మొజాయిక్ రాళ్లతో రంగు రంగుల పువ్వులూ, తీగల్ని తీర్చి దిద్దే పియత్రా దురా కళకు ఇప్పుడు ఫ్యాషన్ పుష్పార్చన చేస్తున్నది.
దాని స్ఫూర్తితో ఇటీవల ఓ దుస్తుల బ్రాండ్ తీర్చిదిద్దిన టాప్, పలాజో సెట్ ఇది. సునిశితమైన కట్ వర్క్‌తో, లేత నిమ్మపండు ఛాయలో మురిపిస్తున్న ఈ డ్రెస్ మొజాయిక్ కళలోని అందాన్ని అందిపుచ్చుకుంది. ఈ పాతకొత్తల మేళవింపు పాలపుంతంత అందంగా లేదూ!