Doctors, Staff Dance | ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది డ్యాన్స్.. వీడియో వైరల్
Doctors, Staff Dance | ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది డ్యాన్స్ చేశారు. (Doctors, Staff Dance) రోగులను పట్టించుకోకుండా డప్పుల శబ్దం మధ్య చిందులు వేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది డ్యాన్స్ చేశారు. (Doctors, Staff Dance) రోగులను పట్టించుకోకుండా డప్పుల శబ్దం మధ్య చిందులు వేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో పని చేసిన మహిళా ఉద్యోగిని పదవీ విరమణ చేసింది. దీంతో ఆమెకు వీడ్కోలు పలికేందుకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దగా డ్రమ్స్ వాయించగా డాక్టర్లు, వైద్య సిబ్బంది డ్యాన్సు చేశారు.
కాగా, ఆ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులు చాలా ఇబ్బంది పడ్డారు. డప్పు శబ్దాలను భరించలేక వేదన అనుభవించారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు, సిబ్బంది తీరుపై పలువురు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రోగులను పట్టించుకోకుండా డాక్టర్లు, సిబ్బంది డ్యాన్సులు చేయడంపై నెటిజన్లు మండిపడ్డారు. మరోసారి ఇలా జరుగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
#हापुड़ के सरकारी अस्पताल (CHC) में जमकर उड़ाई गई नियमो की धज्जियां। अस्पताल में बजे ढोल नगाड़े। अस्पताल के डॉक्टर/कर्मी नाचते रहे मरीज चिल्लाते रहे। @MhfwGoUP @nhm_up @UPGovt @CMOfficeUP @brajeshpathakup @myogioffice @MoHFW_INDIA pic.twitter.com/Cf7gja0ofr
— Naveen Gautam (@AajhapurNaveen) April 30, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dance
- doctors
- drums
- Govt Hospital
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

