Viral Video : మోమోస్ తినాలంటే చిన్నా పెద్దా అందరూ ఆసక్తి కనబరుస్తారు. పలు కేఫ్‌లు, రెస్టారెంట్స్‌లో మోమోస్‌ను సర్వ్ చేస్తున్నా ఫ్రెండ్స్‌తో కలిసి స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌లో తింటే ఆ మజానే వేరని చెబుతుంటారు. ఇక వినూత్న శైలితో తయారవుతున్న మోమోస్ ఢిల్లీలో పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఈ వైరల్ పాప్‌కార్న్ మోమోస్‌ను ప్రయత్నించేందుకు రాజధాని వాసులు దక్షిణ ఢిల్లీలోని జీకే-1 మార్కెట్ బాటపడుతున్నారు.
క్యాట్లీ మోమోస్ అనే వీధి బండిలో ఈ పాప్‌కార్న్ మోమోస్‌ను విక్రయిస్తున్నారు. ఈ చిన్న టేస్టీ మోమోస్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను గౌరవ్ వాసన్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం పది లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది. చిన్న, తేలికపాటి పాప్‌కార్న్ మోమోస్ సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం పొంది, పెద్దసంఖ్యలో జనాన్ని ఆకట్టుకుంటున్నాయని పోస్ట్‌లో రాసుకొచ్చారు.
తన మోమోస్ ఎప్పటినుంచో ఆదరణ పొందుతున్నాయని, ఇక ఇప్పుడు ఇన్‌స్టాగ్రాంలో కూడా పాపులర్ అయ్యాయని స్ట్రీట్ కార్ట్ యజమాని క్యాట్లీ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ మోమోస్ కోసం పెద్దసంఖ్యలో జనం తన బండి ముందు వేచిచూస్తున్నారని అన్నారు. పాప్‌కార్న్ మోమోస్ వెజ్, నాన్‌వెజ్‌తో పనీర్, ఆఫర్ చేస్తున్నారు. స్పైసీ చట్నీ, మయనీస్, వెల్లుల్లి చట్నీతో వీటిని ఆస్వాదిస్తున్నారు.
Read More :