తూకం రాళ్లు
ఇక్కడ కలువ పూలు ఎన్ని పరిమళాలొలికి ఎంతగా దేశాన్ని కీర్తి గుబాళింపుతో పరిమళభరితం చేసినా పుట్టిన బురదలోనే తొక్కబడతాయి
ఇక్కడ కలువ పూలు
ఎన్ని పరిమళాలొలికి
ఎంతగా దేశాన్ని
కీర్తి గుబాళింపుతో
పరిమళభరితం చేసినా
పుట్టిన బురదలోనే తొక్కబడతాయి
ఉన్నోళ్లకు పట్టం కట్టే
కురచ చేతులే అన్నీ
పేదరికంతో మట్టికొట్టుకుపోయిన
దుస్తులను శుభ్రంచేసే
చేతులు మొలవవిక్కడ
పేదరికం, కులవివక్షతో
ఆటంకాలు అయినప్పుడు
ఇక్కడ ఏ ప్రతిభకైనా
సమాధి కట్టబడుతుంది
వివక్షల బండరాళ్లను చీల్చుకుంటూ
మొక్కలా ఎదిగి పూలు పూసినా
ప్రతిభకు గీటురాయిలా
దేశ పటం మీద కీర్తిపతాకమైనా
పేదరికం గొంతు నులిమి చంపేస్తుంది
చూపించిన ప్రతిభంతా
సాధించిన మెడల్సునే
త్రాసులో తూకం రాళ్లుగా వేసి
కనీస జీవనానికి రోడ్డు పక్కన
కూరగాయలమ్ముకుంటూ కనిపిస్తుంది!
(అంతర్జాతీయ మెడల్స్ సాధించి
రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతూ
జీవనం సాగిస్తున్న జార్ఖండ్‌కు చెందిన క్రీడాకారిణి పుష్ప దుస్థితిని చూసి)
-చిత్తలూరి సత్యనారాయణ
91338 32246
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

