మా బొండిగల పాణం వున్నంత దాంక
సీకట్లను సీల్చుకొని వత్తానే వుంటం
మీ కువారాల్ని కూకటి వేళ్లతో పీకి
మా ఇలాకలో మా తెల్వేందో
పెత్తనమేందో సూపిత్తనే వుంటం
గింజుకుంటరో గిరాటుకొట్టుకుంటరో మీ యిస్టం
బలిసినోల్లంత కలిసి
బక్కోడికి అన్యాయం సేత్తే...
దేవుడు వేటెయ్యకపోయినా కర్మ కాటేత్తది...
పేదోడి గుడిసెపైన పెద్దోడి సూపు పడితే
గడ్డీ గాండివం కాకపోయినా
కాలం పుైల్లె గుచ్చుతది...
సమకాలీన మానవ జీవితమే ఆధునిక కవిత్వం. కాలంతో పాటు కవిత్వం కూడా పరిణామం చెందుతుంది. సమాజంలోని జాతి, లింగ, వర్గ, వర్ణ, ప్రాదేశిక నిర్మాణాత్మక అంతరాలతో పాటుగా చిన్నచూపు, వివక్ష, స్వార్థం, ధనిక, పేద వంటి గుణాత్మక