పడగ నలిగింది కానీ
కర్ర విరగలే పాము చావలే
సరిహద్దుల ఆవల
వీలు చూసుకొని బుస కొడుతున్నది!
మన దురదృష్టమేమంటే
చిత్రమేమంటే పాములు పట్టేవాడు
పాము ఆడించినట్లు ఆడుతున్నాడు
ఇక్కడే పుటి ఇక్కడే పెరిగినా
ఈ మట్టి వాసన అతనికబ్బలే!
అతనిప్పుడు ఏమైనా కావచ్చు
అవకాశం వచ్చింది కదా అని
ప్రాంతాన్ని తల తాకట్టు పెడితే
చరిత్రహీనుల లిస్టులో చేరిపోతాడు!
అరుదైన అవకాశం దొరికినప్పుడైనా
చెట్టంత ఆదర్శంగా ఎదగాలి
పోరు నేలలో మొలకెత్తిన బిడ్డలు
ఎన్నడూ లొంగుబాటును సహించరు
ఈ రోజు నీ మాట చెల్లుబాటు కావచ్చు
చరిత్రకారులకు ఆధారాలతో చిక్కిపోతావు
పాము కుక్క ఎన్నటికీ ఒకటి కాదు
దానికి పగ తప్ప విశ్వాసం ఉండదు
నువ్వు ఎన్ని పాలు తాగించినా
నీవే కాదు ఎవరినైనా
కాటు వేయడం దాని సహజ లక్షణం!
ఇది నీకు పరీక్షా కాలం
నీవు నిటారుగా నిలబడని రోజు
జాతి మొత్తం దుమ్మెత్తి పోస్తుంది!!
-కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261