కథలు వినే లేత మనసు
కలలు కనే నీ బాల్యం
కత్తిపోటు కారిపోయే..
అయినోళ్ల పేదరికం
ఏమార్చిన అవిటి లోకం
పెడతోవన నవతరం..
టిక్కు టాకు సోకులకు
ఎక్కి, నక్కే ‘విద్య’లాయే
హెచ్చరించ పడుసులాయే..
జగమెరగని తప్పటడుగు
వేసెనెట్ల ‘తప్పు’టడుగు..!
కేకువెట్టిన తేనె గుణం
క్రైం కథను రాసెనెట్ల..!
అడ్డొచ్చిన పసిమొగ్గను
అదిమిపట్టి చిదిమెనెట్ల..!
పదారేళ్ల ‘విష బీజం’
పరిస్థితేమో చెడ్డదాయే..
బుద్ధిజెప్పే పెద్దోళ్లకు
సెల్లుపోన్ల సొల్లాయే..
నీళ్లేమో రాళ్లకేసి
పంట పచ్చగాసించుడెట్ల..!
ఏడ వుట్టే ‘హేయ’ బుద్ధి?
‘జువైనల్’ను పరికిస్తే
ప్రశ్నలెన్నో పుట్టుకొచ్చే..
ఏడ లోపం..
ఏమి శాపం..
ఎవరి నేరం?
అమ్మా.. బుజ్జితల్లి (సహస్ర)
అడుగుదమా న్యాయమెట్లని?
ఈ అంధకార అవ్యవస్థను
సరిజేసుడెట్లని..
– సురేంద్ర బండారు 90108 47120