జీవనాక్షరాలు
అంతరంగ లోతుల్ని తడుముతూ మనసులోని భావాల్ని పెదవి దాటని మాటల్ని మౌనంగానే పలకరిస్తూ అక్షరాలై జాలువారుతాయి
అంతరంగ లోతుల్ని
తడుముతూ
మనసులోని భావాల్ని
పెదవి దాటని మాటల్ని
మౌనంగానే పలకరిస్తూ
అక్షరాలై జాలువారుతాయి
అహరహం తపించే కలం నుంచి
అనంత జ్ఞానాన్ని అన్వేషిస్తూ
ఆనందాన్ని కలబోసుకొని
తన్మయత్వంతో కవితాక్షరాలై
అలవోకగా చేజారి
నెత్తావులను హత్తుకొని
సృజన లోకపు దారి చూపుతాయి
జీవిత తొలిమెట్టుపై
అడుగిడిన సమయాన
లోకానుభవాల్ని నేర్పుతూ
ఓర్పును ఒద్దికగా అద్ది
సవాళ్లను అధిగమించే
ఆత్మవిశ్వాసకు ఆయుధాన్ని
అందించే జీవనాక్షరాలై
అక్షర రూపమెత్తిన అమ్మలా
అక్కున చేర్చుకొని
జీవనోత్సాహాన్నిస్తూ
కొన్ని చరిత్రలై ఎన్నెన్నో
గాథలై
అజేయమవుతాయి
నెల్లుట్ల సునీత
79894 60657
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో 58 ఎంపీపీ స్థానాల్లో ఎన్నికలు పెండింగ్..!
AP News | బొత్స ఇలాకాలో వైసీపీకి ఘోర పరాజయం.. కేవలం ఒక్క ఎంపీపీ స్థానమే దక్కిన వైనం..!
Rajinikanth | మనవడితో రజినీకాంత్ స్టైలిష్ వాక్ అదిరిందంతే
Indigo Employee | ఇండిగో ఉద్యోగిని హత్య కేసు.. స్నేహితుడి భార్యే హంతకురాలు..!
రేపటి నుండి కోదాడలో 93వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

