ఆంధ్ర అనే పేరు పెట్టుకొని తెలంగాణ గడ్డమీద, అడ్డావేసి మీడియా ముసుగులో అరాచక వాదాన్ని కొనసాగిస్తున్న రాధా వెంకట కృష్ణ గారికి.. తెలంగాణ సమాజం తరఫున విన్నపంతో కూడిన హెచ్చరిక మిళితమైన సూచన !
ముందుగా, మీరు ఏబీఎన్ పేరుతో నడుపుతున్న ఒక చానెల్లో, శుక్రవారం నాడు నడిపిన ఒక డిబేట్లో, బీఆర్ఎస్ సీనియర్ రాజకీయ నాయకుడు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావును ఉద్దేశించి గెటవుట్ ఆఫ్ మై షో అంటూ పదే పదే గద్దిస్తూ అవమానకరంగా వ్యవహరించడాన్ని యావత్తు తెలంగాణ సమాజం తరఫున ఒక తెలంగాణ బిడ్డగా తీవ్రంగా ఖండిస్తున్నాను.
నువ్వు ముందలేసుకున్న చర్చలో భాగంగా, నువ్వడిగితే ఎమ్మెల్సీ రవీందర్రావు వ్యక్తం చేసిన ధర్మగ్రహ ఆవేదనను మనసుతో అర్థం చేసుకోకుండా, అది నేరుగా నిన్నే అన్నట్టు మనసు మీదికి తెచ్చుకొన్నవే.. తక్కెళ్లపల్లి చేసిన కామెంట్లోని ఒక పదం నీ తలతిక్కకు కారణమైందా వెంకటకృష్ణ? రేవంత్‌రెడ్డిని అంటే నీకు బాధయిందా రాధా? లీకుల పేరుతో నిరాధార ఆరోపణలను అక్షరాల పేరుతో అచ్చోసిన ఆంబోతులను తెలంగాణ సమాజం మీదకు వదిలితే, అవి చేస్తున్న గుండెగాయాలకు బాధ్యత ఎవరువహించాలె? ఎవ్వరు పడితే వాళ్లు ఏదిపడితే అది ప్రచారం చేస్తరా? అని ఆయన జనరలైజ్ చేసి ధర్మాగ్రహం వ్యక్తం చేస్తే నీ భుజాలు తడుముకుంటూ…
ఆ మాటల ఈటెలను నీ చేయితోని నువ్వే, గుండెకు గుచ్చుకొని గాయపడి, తేలుకుట్టిన దొంగలా గాయి గాయి అయ్యి, నీ ఇగో.. ముక్కలు ముక్కలు కాగా, నువ్వు కక్కిన మాటలు విషపు గడ్డలుగా రాలడం… ఆ నిమిషం సేపు నువ్వు కొనసాగించిన క్రూరాతిక్రూరమైన ఆధిపత్యపు అభిజాత్యాహంకార జుగుప్సాకర ఏకపాత్రాభినయం తెలంగాణ హృదయాలను తీవ్రంగా గాయపరిచింది. నాడు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ పదాన్ని నిషేధించిన ఆంధ్రా పాలకవర్గాల ఏజెంటు మల్లోపాలి ఆంధ్రా చానల్లో యాంకరింగ్ చేస్తున్నట్టుగా అనిపించింది.
తెలంగాణ గడ్డ మీద చాలా రోజుల తర్వాత మళ్లా తెలంగాణ పట్ల తీవ్రమైన వివక్ష కండ్లకు కట్టింది.
తెలంగాణలో ఈ ఘటన రెండేండ్లలోనే మారిపోయిన ఒక వర్తమాన సామాజిక రాజకీయ వాస్తవం.
దీన్ని తెలంగాణ సమాజం రాబోయే రోజుల్లో.. దీని మీద ఎటువంటి కార్యాచరణ అనుసరిస్తుంది? అనేది కాలమే నిర్ణయిస్తుంది. తప్పక నిర్ణయింస్తుంది. దాని గురించి మనం మళ్లా మళ్లా చర్చించుదాం.
ఐతే..రాధా వెంకట కృష్ణా.. నిన్నటి నీ…గెటవుట్ ఆఫ్ మై షో అనే అహంకారపూరిత మాటల గురించి.. ఒక్క మాట!
ఒక విషయం రాధా వెంకట కృష్ణ. నీ పత్రికలో అచ్చువేస్తున్న, నీ చానెల్లో నువ్వు వండి వారుస్తున్న వార్తలు, కథనాల పేరుతో కక్కుతున్న విషం తెలంగాణ సమాజాన్ని కలుషితం చేస్తున్నదనేది వాస్తవం. ఈ సంగతిని నువ్వు గుర్తించాలే రాధా. సమస్య అంతా… పత్తిత్తులు అని చెప్పుకుంటూ.. నీతి సూత్రాలు వళ్లించే నీ లాంటి విషపత్రికలు, చానెళ్లతోనే. రేవంత్‌రెడ్డి బూతు కూతలతో విషం చిమ్ముతున్న అరాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి వంటి ఉన్నతస్థాయి పదవిలో కూసోవడం తెలంగాణ దౌర్భాగ్యంగా దాపురించింది.
ఆయన రోజురోజుకూ ఎంత గలీజుగా మాట్లాడుతున్నాడో సభ్యసమాజం గమనిస్తూనే ఉన్నది.. కానీ నీకే అర్థం కావట్లేదు. కేసీఆర్ మీద ద్వేషంతో, వారి కుటుంబం మీద అక్కసుతో రేవంత్‌రెడ్డి కూతలను యథాతథంగా ఎట్లా అచ్చువేస్తున్నావు? ఎట్లా ప్రసారం చేస్తున్నావు వెంకట రాధాకృష్ణ? ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేసే బాతఖూనీలను తొత్తు పలుకులుగా పేజీలకొద్దీ నింపుతూ వార్తాకాలుష్యాన్ని ఎలా పెంచుతున్నావు? నీ ఆంధ్రా పత్రిక తెలంగాణ వ్యతిరేక విషపు కరపత్రంగా తెలంగాణ మీదబడి…
అచ్చోసిన ఆంబోతులాగా తిరుగుతుంటే చూస్తూ నోర్మూసుకొని ఉండాలా? ఈ పిచ్చి నాకొడుకులు ఎందుకు రాస్తుండ్రండీ’ అని అంటే అది నీకు తగిలిందా.. వెంకటకృష్ణ? గుచ్చుకుందా గుండెకు? అదే చెప్పేది మరి.. నీకే లేదు గుండె. అందరికీ ఉన్నది కదా! అట్లాగే అందరికీ గుచ్చుకుంటది అనే సోయి ఉండాలి కదా బ్రో మరి! మనకు తగిలితేగానీ నొప్పి తెలియదన్నట్టు.. ఏదేమైనా… నా మాట నీకు గుచ్చుకుందా? అయితే సంతోషం. ఎందుకంటే… తెలంగాణ సమాజం విషం చిమ్మే మీ లాంటి వాళ్లను ‘యూ గెటవుట్ ఆఫ్ మై తెలంగాణ’ అని వందలసార్లు అంటున్నది. మీరే జలగల్లాగ వదుల్తలేరు.. కదుల్తలేరు.
– సహస్ర