మౌంట్ మౌంగనుయి(న్యూజిలాండ్): న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి టీ20 పోరులో సఫారీలు 7 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించారు. కివీస్ నిర్దేశించిన 92 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది.
టోనీ డీ జార్జ్(2), హెర్మన్(7) విఫలమైనా కానర్ ఎస్తర్జెన్(45) రాణించడంతో గెలుపు వాకిట నిలిచింది. జెమీసన్, ఫౌల్క్స్, సాంట్నర్ ఒక్కో వికెట్ తీశారు. తొలుత మోకెనా (3/26), కొట్జె (2/14), బార్ట్‌మన్ (2/22), మహారాజ్ (2/25) ధాటికి కివీస్ 14.3 ఓవర్లలో 91 పరుగులకు కుప్పకూలింది. జేమ్స్ నీషమ్ (26) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. మోకెనాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.