షాంఘై: చైనీస్ గ్రాండ్పి రేసులో ఇటలీ యువ రేసర్ కిమీ ఆంటోనెలి కొత్త చరిత్ర లిఖించాడు. ఆదివారం జరిగిన రేసులో 19 ఏండ్ల ఆంటోనెలి టైటిల్ విజేతగా నిలిచాడు. ఎఫ్1 చరిత్రలో రేసు గెలిచిన రెండో యంగెస్ట్ డ్రైవర్గా ఆంటోనెలి రికార్డుల్లోకెక్కాడు. 2016లో 18 ఏండ్ల వయసులో టైటిల్ గెలిచిన మ్యాక్స్ వెర్స్టాపెన్ ముందు వరుసలో ఉన్నాడు.
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన రేసులో ఆంటోనెలి గంటా 33 నిమిషాల 15.607 సెకన్లలో పోడియం ఫినిష్ చేయగా, జార్జ్ రస్సెల్, లూయిస్ హామిల్టన్ వరుసగా రెండు, మూడు స్థానాలతో పోడియం ఫినిష్ చేశారు. మరోవైపు అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ఏప్రిల్ 12, 19వ తేదీల్లో జరుగాల్సిన బహ్రెయిన్, సౌదీ అరేబియా గ్రాండ్ ప్రి రేసులను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.