ఆ కళ్ళు తెలంగాణ సాయుధ పోరులు చూసిన కళ్ళు..
ఆ కళ్ళు వెట్టిచాకిరి వ్యతిరేక పోరును చూసిన కళ్ళు…
భూమి భుక్తీ విముక్తి పోరుకు సై అంటూ జై కొట్టిన పిడికిలది…
నాలుగు తరాలను చూసిన కళ్ళు…
ఈ మట్టి పోరుతత్వాన్ని ఒంటికి రాసుకున్న తరమది…
ఆ తరం ఆలోచనలకు వృద్ధాప్యం లేదన్న చురుకుతనాన్ని సూడు..
కొంతమంది వృద్ధులు నేటికీ యువకులు చూడు శ్రీశ్రీ…
ఆ పోరు మట్టి మీద పిడికిలెత్తిన 95 ఏండ్ల యువకుడిని చూడు….
ఉప్పల మలసూరు, ధర్మ బిక్షం, భీమిరెడ్డిల వారసత్వాన్ని కొనసాగించు.,..
గ్రామ స్వరాజ్యాన్ని బతికించు..
నువ్వు నాగారం మట్టి మహిమ..
నాగారం చేసిన మట్టి బొమ్మవు…
నూరేండ్లు మట్టి మనుషులతో కలిసి జీవించే సంతకం చేసేయ్ బాపు…
నాగారం బాపుగా నిలిచిపో…
(95 ఏండ్ల యువకుడు గుంటకండ్ల రామచంద్రారెడ్డి సర్పంచ్‌గా గెలిచాడన్న వార్త విన్నాక..)
-జూలూరు గౌరీ శంకర్