‘తండేల్ చిత్రంలో నాగచైతన్యకు ఉత్తమ నటుడిగా అవార్డు రావడం పట్ల నాగార్జున ఎక్స్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ‘తండేల్’లో చైతూ అత్యద్భుతంగా పర్ఫార్మ్ చేశాడని కొనియాడారు. ‘దుళ్ల కొట్టావ్ నాన్న’ అంటూ సినిమాలోని డైలాగ్‌ని ఉదహరిస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. గద్దర్ అవార్డుల్లో ఈ ఏడాది తొలిసారి ‘ఏఎన్నార్’ జాతీయ పురస్కారాన్ని ప్రవేశ పెట్టడం పట్ల నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు. దాదాసాహెబ్ఫాల్కే అవార్డు గ్రహీత, మహానటుడు అయిన తన తండ్రి నాగేశ్వరరావుకు ఇది నిజమైన నివాళి అని అభివర్ణించారు. ఏఎన్నార్ పురస్కారాన్ని తొలిసారి జయసుధకు అందించడం సముచిత నిర్ణయమని అన్నారు. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కడం పట్ల నాగార్జున శుభాకాంక్షలు తెలియజేశారు.