ఏరై పారలేక మరోసారి
చాప కింద నీరైవస్తున్నరు
ఇద్దరి భాష ఒక్కటే అంటే
బాసింగాలు బద్దలు చేస్తిమి!
విడిపోతే మీ బతుకు చీకటంటే
నిత్య వెలుగులు నింపి చూపిస్తిమి
ఎత్తు మీదుండ్రు నీళ్లెట్లొస్తవంటే
ఎగిరి దూకే నదులను సృష్టిస్తిమి!
కాలం పట్టింది పదేండ్లే
దేశానికి నమూనా జూపిస్తిమి!
ఒక్కసారి ఓటు చేజారితేనే
మూల మూలన పరాయి విగ్రహాలు
నిస్సిగ్గుగా మొలుస్తున్నయి!
తెలంగాణ తల్లి బోసివోయి
కండ్ల ముందే గోస పడుతున్నది
మనదేమో ఒకటే దెబ్బ
రెండే తుకుడల్
వాళ్లట్ల కాదు
అంట కాగేటోళ్లను సంకనెత్తుకొని
చాప కింద నీరైవొస్తున్నారు
వాడు గాన గంధర్వుడైతే మనకేమి
మన పాట పాడనోడు పరాయివాడే!
కుట్రలకు తెరదీస్తున్నారు
సాధించుకోవడంతో సరిపోదు
నిలబెట్టుకోకపోతే
మనం చేసేది మరో చారిత్రక తప్పిదం!
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
-కోట్ల వేంకటేశ్వర రెడ్డి
94402 33261