Divorced daughter | భర్తకు విడాకులిచ్చిన బిడ్డను మేళతాళాలతో పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి..!
Divorced daughter | సాధారణంగా అయితే ఆడబిడ్డకు ఎన్నో ఆంక్షలు. ‘అత్తగారింట్లో అణుకువగా నడుచుకోవాలి బిడ్డా’ అని తల్లిదండ్రులు చెబుతుంటారు. ఎవరేమన్నా ఎదురు మాట్లాడకుండా సర్దుకుపోవాలని సూచిస్తుంటారు. అవతలి వాళ్లు కూడా మంచి వాళ్లే అయిన దగ్గర ఆ సూచనలు పాటిస్తే బాగానే ఉంటుంది. కానీ వాళ్లు మంచి వాళ్లు కాకపోతే..! నిత్యం వేధింపులకు గురిచేస్తే..! శారీరకంగా కూడా హింసిస్తే..! ఆ ఆడబిడ్డ ఏం చేయాలి..? కచ్చితంగా ఎదరుతిరగాలి..! లేదంటే తన దారి తాను చూసుకోవాలి..!
Divorced daughter : సాధారణంగా అయితే ఆడబిడ్డకు ఎన్నో ఆంక్షలు. ‘అత్తగారింట్లో అణుకువగా నడుచుకోవాలి బిడ్డా’ అని తల్లిదండ్రులు చెబుతుంటారు. ఎవరేమన్నా ఎదురు మాట్లాడకుండా సర్దుకుపోవాలని సూచిస్తుంటారు. అవతలి వాళ్లు కూడా మంచి వాళ్లే అయిన దగ్గర ఆ సూచనలు పాటిస్తే బాగానే ఉంటుంది. కానీ వాళ్లు మంచి వాళ్లు కాకపోతే..! నిత్యం వేధింపులకు గురిచేస్తే..! శారీరకంగా కూడా హింసిస్తే..! ఆ ఆడబిడ్డ ఏం చేయాలి..? కచ్చితంగా ఎదరుతిరగాలి..! లేదంటే తన దారి తాను చూసుకోవాలి..!
కాన్పూర్‌కు చెందిన ఓ ఆడబిడ్డ అదే పనిచేసింది. అత్తగారి ఇంట్లో వేధింపులకు తట్టుకోలేక భర్తతో విడాకులు తీసుకుంది. బిడ్డ చేసిన పనికి ఆమె తండ్రి కూడా మెచ్చుకున్నాడు. అంతేకాదు ఆమెను మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకొచ్చాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్‌కుమార్ అనే ఓ వ్యక్తి ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న తన కుమార్తె ఉర్వి (36) ని 2016లో ఢిల్లీకే చెందిన కంప్యూటర్ ఇంజినీర్‌కు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు.
కొన్ని రోజులు బాగానే ఉర్వి అత్తింటివాళ్లు ఆ తర్వాత వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. గత ఎనిమిదేళ్లుగా వాళ్లలో ఎలాంటి మార్పు రాకపోతే వేధింపులు అంతకంతకే పెరిగిపోయాయి. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. గత ఫిబ్రవరి 28న కోర్టు తీర్పు వెలువడింది. ఆమె అభ్యర్థన మేరకు న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. దాంతో ఉర్వి తండ్రి ఆమెను అత్తవారి ఇంటి నుంచి బ్యాండ్ బాజాలతో, మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకెళ్లాడు.
‘మేము మా కూతురిని పెళ్లిచేసి అత్తారింటికి ఎలా పంపామో అలాగే పుట్టింటికి తెచ్చుకున్నాం. విడాకులతో మా కుమార్తె, మనవరాలు నిరాశలో ఉండిపోకూడదని, నేటి నుంచి వాళ్లు సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించాలని ఈవిధంగా చేశాం’ అని అనిల్ కుమార్ తెలిపారు. కాగా, తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ముందు కొంత సమయం తీసుకుంటానని ఉర్వి చెప్పారు. ఉర్విని ఆమె తండ్రి మేళతాళాలతో తీసుకొచ్చిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది.
కష్ట సమయంలో కూతురుకు తోడుగా నిలిచిన ఆ తండ్రిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. గతంలోనూ జార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి విడాకులు తీసుకున్న తన కూతురిని ఇలాగే మేళతాళాలు, బాణసంచా సందడితో పుట్టింటికి ఆహ్వానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

